హుజురాబాద్ తెరాస అభ్యర్థి ఇతనే.

Share this news

BREAKING NEWS: హుజురాబాద్ తెరాస అభ్యర్థి ఇతనే.

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు.


గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో ధీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లుశ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలుకెల్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సిఎం కెసిఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

హుజురాబాద్ అభ్యర్థిగా బిసిలకు అవకాశం ఇచ్చినందుకు…

సీఎం కేసీఆర్, మంత్రి గంగులకు క్రుతజ్ణతలు తెలిపిన బిసి సంఘాల నేతలు, మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో బిసి సంఘాల నేతల మిడియా సమావేశం

హాజరైన రజక, కుమ్మరి,యాదవ, నాయీభ్రాహ్మణ, మేరు, సగర అన్ని బిసి సంఘాల నేతలు

రాబోయే హుజురాబాద్ ఎన్నికల్లో బేషరతుగా టీఆర్ఎస్ కు మద్దతు

బిసిల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న క్రుషి అభినందనీయం

ఒపెన్ నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయించడం కేసీఆర్ గారి బిసి పక్షపాతానికి నిదర్శనం

గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అభినందనలు- బిసి సంఘాలు


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *