ప్రతిమహిళకు నెలలు 1500 డైరెక్ట్ బ్యాంకులోకి. వెంటనే అప్లై చేయండి!
‘ఆడబిడ్డ నిధి’పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన
అమరావతి: ఆడబిడ్డల భవిష్యత్‌ను పరిరక్షించేందుకు ప్రభుత్వం ‘ఆడబిడ్డ నిధి’ పేరుతో ప్రత్యేక పథకం తీసుకురానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకం గురించి వివరించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పథకం ద్వారా ప్రతి మహిళా లబ్ధిదారికి నెలకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18,000 ఇవ్వనున్నట్లు తెలిపారు.
సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ‘‘కరుణతో సమాజాన్ని మార్చడమే మాకున్న లక్ష్యం. ఆడబిడ్డలకు ప్రత్యేక భద్రత మరియు ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది మహిళల ఎదుగుదలకు దోహదపడుతుంది’’ అని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పథకాలు లేనప్పటికీ, తమ ప్రభుత్వం ముందుగానే ఆడబిడ్డల కోసం ఈ విధంగా ఆర్థిక బలాన్ని కల్పిస్తున్నదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 నుండి 59 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల ఖాతాల్లో నేరుగా ఈ నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.5 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. టిడిపి పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఈ వాగ్దానాన్ని, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.