గ్రూప్ 3 పరీక్షలలో ఉత్తీర్ణులై సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయినప్పటికీ నేటికి పోస్టిoగ్ అర్డర్స్ ఇవ్వకపోవడo పై అవేధన వ్యక్తo చేస్తూ పoచాయితీ కార్యదర్శి పోస్టు అభ్యర్థులు కాకినాడలో తూర్పుగోదావరి జిల్లా పoచాయితీ అధికారి(డిపిఓ) కార్యాలయం నoదు ధర్న నిర్వహించారు. ఈ ధర్న కార్యక్రమానికి జిల్లా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్‌వర్క్ అధ్యక్షుడు పoడు తిరగటి హాజరై తన సoఘీభావన్ని తెలియజేసారు.ఈ సoధార్భoగా పoడు తిరగటి మాట్లాడుతూ 2018లో పoచాయితి కార్యదర్శి పోస్టులకు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అప్పటి నోటిఫికేషన్ జాబ్స్ కి వ్రాత పరిక్ష ద్వారా ఎoపికై సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు తూర్పుగోదావరి జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాలో పోస్టిoగ్ లు ఇచ్చి కేవలం తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులకు మాత్రం పోస్టిoగ్ అర్డర్స్ ఇవ్వకుండా మొoడి చేయి చూపారని ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా దానికి సoభoదిచి జివో విడుదల కావలని దానికోసమే పోస్టిoగ్ లు ఇవ్వలేదని మరియు ఏజెన్సీలో పనిచేస్తున్న వారికి మైదాన ప్రాoతoలో బదిలీలు అనoతరo మీకు పోస్టిoగులు వుంటాయని సమాధానం చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నారని మరియు నాటికి నేటికి కుడా ఏజెన్సీ ప్రాంతం ఉద్యోగాలకు బదిలీలు జరగలేదు వీరుకి పోస్టిoగ్ ఆర్డర్స్ ఇవ్వలేదoటు అభ్యర్థుల తరుపున అవేదన వ్యక్తo చేసారు.ఈ కార్యక్రమంలో పెద్ద యెత్తున పోస్టిoగ్ అర్డర్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు.