YSR Sampoorna Poshana Postponed to Sep 7

Spread the love

వైఎస్సార్ సంపూర్ణ పోషణ సెప్టెంబర్ 7 కు వాయిదా


సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా సెప్టెంబర్ 1 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించవలసి ఉన్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7 వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ & ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.


వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించే లక్ష్యంతో రూ. 1,863.11 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ని 55,607 అంగన్ వాడీ కేంద్రాలలో నమోదైన 30,16,000 మందికి లబ్ధి చేకూరేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అయితే మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతి కారణంగా కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించినందున ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7 వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.
జారీ చేసినవారు: కమీషనర్, సమాచార, పౌరసంబంధాల శాఖ, విజయవాడ


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *