తల్లికి వందనం డబ్బులపై బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే రూ.15 వేల బెనిఫిట్ మిస్ అయ్యే ఛాన్స్!

తల్లికి వందనం డబ్బులపై బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే రూ.15 వేల బెనిఫిట్ మిస్ అయ్యే ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. మరో వారం రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో “తల్లికి వందనం” పథకం నిధుల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈసారి డబ్బులు పొందాలంటే ఒక ముఖ్యమైన పని తప్పనిసరిగా చేయాలని అధికారులు చెబుతున్నారు. లేదంటే అర్హత ఉన్నా కూడా బెనిఫిట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు అండగా “తల్లికి వందనం” పథకాన్ని ప్రవేశపెట్టింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి.
అయితే ప్రభుత్వం ఇస్తున్న మొత్తం రూ.15 వేలలో మొత్తం డబ్బు నేరుగా అకౌంట్లో జమ చేయదు. అందులో రూ.13 వేల మొత్తాన్ని విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. మిగిలిన రూ.2 వేల మొత్తాన్ని పాఠశాలల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. విద్యార్థుల చదువుతో పాటు స్కూల్ నిర్వహణకు కూడా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధానం అమలు చేస్తున్నారు.
వేసవి సెలవులు ముగియడంతో జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈసారి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఆధార్ లింక్ లేకపోతే డబ్బులు అకౌంట్లో జమ కావని అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది ఇదే కారణంతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. అర్హత ఉన్నప్పటికీ తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోవడంతో కొందరికి నిధులు జమ కాలేదు. దీంతో ఈసారి ముందుగానే విద్యాశాఖ అలర్ట్ జారీ చేసింది. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి తమ బ్యాంక్ ఖాతాను వెంటనే చెక్ చేసుకోవాలని సూచించింది.
మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేరుగా బ్యాంక్ శాఖకు వెళ్లవచ్చు. అక్కడ సిబ్బందిని సంప్రదించి ఖాతా వివరాలు చెక్ చేయించుకోవచ్చు. ఒకవేళ ఆధార్ లింక్ లేకపోతే వెంటనే అప్డేట్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దని హెచ్చరిస్తున్నారు.
ఆధార్ లింక్ ప్రక్రియ కూడా చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డు ఒరిజినల్, జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ తీసుకెళ్లాలి. బ్యాంక్‌లో KYC ఫారమ్ తీసుకుని అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేసి సంతకం చేయాలి. అనంతరం ఆధార్ జిరాక్స్ జతచేసి బ్యాంక్ సిబ్బందికి అందజేయాలి.
బ్యాంక్ సిబ్బంది OTP లేదా బయోమెట్రిక్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. సాధారణంగా 2 నుంచి 3 పని దినాల్లో ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. అందుకే ఇప్పుడే చెక్ చేసుకుని అవసరమైతే అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే రూ.15 వేల బెనిఫిట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.






