Raasi Phalalu 12.08.2020

Spread the love

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌
12.08.2020 సౌమ్య వాసరే
రాశి ఫలాలు

🐐 మేషం
అనుకున్న పనిని పూర్తి చేస్తారు. మనః సౌక్యం కలదు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు.
ఇష్ట దైవారాధన మంచినిస్తుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
మిశ్రమ వాతావరణం కలదు. ఉత్సాహంగా పని చేస్తే తప్ప పనులు పూర్తికావు. సమయానికి నిద్రాహారాలు అవసరం. పెద్దల సహకారం ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి.
శని ధ్యానము శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
శుభ కాలము. సుఖసౌఖ్యాలు ఉన్నాయి. ప్రయత్న కార్యానుకూలత ఉన్నది. అభివృద్ధి కోసమై చేసేటటువంటి పనులు సఫలీకృతం అవుతాయి. ఆర్థిక అంశాల్లో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి. శివారాధన వలన బాగుంటుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారంలో ముందుచూపు అవసరం. విష్ణు సందర్శనం శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. బలమైన ప్రయత్నం ఫలిస్తుంది. బంధుమిత్రులను కలిసి కీలక విషయాలు చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
దుర్గా ఆరాధన శ్రేయస్సును ఇస్తుంది.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ప్రయత్నలోపం లేకుండా చూసుకోవాలి. మానసికంగా చంచల స్వభావాన్ని వీడండి. అనవసర ఖర్చులు ఉంటాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోను నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ఈశ్వర ధ్యానం శుభప్రదం.
💃💃💃💃💃💃💃

తుల
అనుకున్నది సాధిస్తారు. బంధుప్రీతి ఉంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. గొప్పవారితో సత్సాంగత్యం కలుగుతుంది.
ఇష్టదైవం సందర్శనం శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
సకాలంలో పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుపుకుపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
మిశ్రమకాలం. లక్ష్యాలను చేరుకోవాలంటే బాగా కృషి చేయాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శత్రువులకు దూరంగా ఉండాలి.
దుర్గ ధ్యానం శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
విజయకాంక్ష నెరవేరుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉండాలి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రమ అధికం అవుతుంది.
దుర్గా ఆరాధన శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో ధనలాభం ఉంది.
లక్ష్మీ నామస్మరణ మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అదిగమించే ప్రయత్నము చేస్తారు.
హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవంతు 👌
🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: