Admission to Ambedkar University degree and PG courses begins
అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ, పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం
హైదరాబాద్, ఆగష్టు 21, 2020.
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, PG డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభం అయినట్లు విశ్వవిద్యాలయ ఇంచార్జ్ రిజిస్ట్రార్ డా.జి.లక్ష్మా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in లేదా www.braou.ac.in లో పొందొచ్చని వెల్లడించారు. అర్హత పరీక్ష 2016, 2017, 2018, మరియు 2019* లలో పాస్ అయిన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చని తెలిపారు. ఫీజు చెల్లించడానికి చివరి తేది సెప్టెంబర్ 10, 2020.
2019-20 విద్యాసంవత్సరం మొదటీ సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు రెండో సంవత్సర అడ్మిషన్ ఫీజును, మూడో సంవత్సర ఫీజు సకాలంలో చెల్లించలేక పోయిన విద్యార్థులు కూడా సెప్టెంబర్ 10వ తేదీ లోపు ఆన్ లైన్ లో చెల్లించొచ్చని సూచించారు. పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని ఆధ్యయన కేంద్రంలో లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు : 7382929570/580/590/600 లలో లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040-23680333/555 ఫోన్ నెంబర్లలో సంప్రదించొచ్చన్నారు.
డిగ్రీ, పీజీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు, (2011 విద్యా సంవత్సరం నుండి 2019 వరకు) ఫీజు చెల్లించ లేకపోయిన వారు కూడా ఈ అవకాశాన్ని సధ్వినియోగ పర్చుకోవాలన్నారు. TS / AP ఆన్ లైన్ లేదా క్రెడిట్ / డెబిట్ కార్డ్ ద్వారా కూడా చెల్లించొచ్చని వివరించారు. ఫీజు చెల్లించడానికి చివరి తేది సెప్టెంబర్ 10, 2020.