Janasena mourns Pranab Mukherjee’s demise

Spread the love

శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు లేని లోటు తీరనిది

భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు దివంగతులయ్యారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత రాజకీయాల్లో.. తనదంటూ సొంత ముద్రను కలిగి ఉన్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మరణం.. దేశానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి కుటుంబానికి నా తరఫున జనసేన తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.


స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో పుట్టి.. రాజకీయాల్లో ప్రవేశించిన శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో ఆయనొక విలక్షణమైన ధ్రువతారగా వెలిగారు. ఈ దేశం కూడా.. పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో ఆయన సేవలను సముచితంగా సత్కరించుకుంది. దేశ రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలు మరచిపోకుండా.. తన పండిట్ల కుటుంబపరంగా వస్తున్న దేవతార్చన సంప్రదాయం అనుసరించి ప్రత్యేక పర్వ దినాలలో ఆ సంప్రదాయాన్ని అనుసరించడం విశేషం. ఆ విలక్షణత నన్నెంతో ఆకట్టుకొంది. ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం.. భవిష్యత్ తరాలకి
ఆదర్శనీయం, అనుసరణీయమైనవి.

పవన్ కల్యాణ్
అధ్యక్షుడు, జనసేన


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *