ఉచిత విద్యుత్‌ పథకం – నగదు బదిలీకి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం

Spread the love

ఉచిత విద్యుత్‌ పథకం – నగదు బదిలీకి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం
దీనిపై కేబినెట్లో చర్చ – మంత్రులతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ వ్యాఖ్యలు

రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే
ఒక్క కనెక్షన్‌కూడా తొలగించం, ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్‌చేస్తాం
కనెక్షన్‌ ఉన్న రైతు పేరుమీద ప్రత్యేక ఖాతా
ఆఖాతాలో డబ్బులు వేయనున్న ప్రభుత్వం
వాటిని డిస్కంలకు చెల్లించనున్న రైతు
పూర్తి బాధ్యత ప్రభుత్వానిది
మీటర్ల ఖర్చు డిస్కంలు ప్రభుత్వానిదే
ప్రస్తుతం సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం లేదు
ఉన్నపథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నాం
10వేల మెగావాట్ల సోలార్‌తో పథకాన్ని మరింతగా దీర్చిదిద్దుతాం
వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌పథకానికి ఢోకాలేకుండా చేస్తున్నాం
పగటిపూట 9 గంటల కరెంటు ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు
రబీ సీజన్‌నుంచి పూర్తిగా అమలు
ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ ఒక్క వైయస్సార్‌ గారికే
అందుకే పథకానికి ఆయన పేరు
చంద్రబాబు ఉచిత విద్యుత్తు సాధ్యంకాదన్నారు
కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడమే అన్నారు
సుమారు 8వేల కోట్లు ఉచిత విద్యుత్తు బకాయిలుపెట్టారు
మనం వచ్చాక బకాయిలు తీర్చాం
1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రడేషన్‌ చేశాం
నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం

– రైతులకు ఉచిత విద్యుత్‌ తీసుకొచ్చిన ఘనత వైయస్సార్‌గారిది
– అప్పుడు ఉచిత విద్యుత్‌ అంటే.. కరెంటు తీగలమీద బట్టలు ఆరేసుకోవడమేనని ఇదే చంద్రబాబుగారు ఎద్దేవా చేశారు
– ఉచిత విద్యుత్‌ కుదరదు, సాధ్యంకాదని వాదన చేశారు
– ఉచితంగా కరెంటు ఇవ్వడమేంటని అపహాస్యం చేశారు
– చివరకు బషీర్‌బాగ్‌లో కాల్పులకు దిగిన చరిత్ర చంద్రబాబుగారిది
– నాన్నగారు ఈ పథకాన్ని తీసుకురావడమే కాక, రైతులు చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేస్తూ ప్రమాణస్వీకారం రోజు ఫైల్‌పై సంతకాలు చేశారు.
– ఆతర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఉచిత విద్యుత్‌ పథకాన్ని నీరుగార్చాయి
– పగటిపూట 9 గంటల పాటు కరెంటు ఇచ్చే పరిస్థితులే లేవు
– మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలన చేస్తే దాదాపు 40శాతం ఫీడర్లలో పగటిపూట 9 గంటలపాటు కరెంటు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలే లేవు
– ఈ పరిస్థితులు మార్చడానికి, ఫీడర్లలో ఏర్పాటు, అప్‌గ్రడేషన్‌ పనులకోసం రూ.1700 కోట్లు కేటాయించాం
– దీనివల్ల నడుస్తున్న ఖరీఫ్‌ సీజన్‌కు 89శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలపాటు ఉచితంగా ఇస్తున్నాం
– మిగిలిన చోట్ల కూడా వేగంగా పనులు పూర్తిచేసి రబీనాటికి 9 గంటలపాటు పగటిపూటే కరెంటు ఇస్తాం.
– మార్చి 31, 2019 నాటికి చంద్రబాబుగారు ఉచిత విద్యుత్‌పథకం కింద డిస్కంలకు డబ్బులు ఇవ్వకుండా దాదాపు రూ.8వేల కోట్లు బకాయిపెట్టారు.
– మనం అధికారంలోకి వచ్చాక ఆ డబ్బు మొత్తం చెల్లించాం.
– ఈ డబ్బులు కట్టడమే కాకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి తీసుకోవాల్సిన అన్నిచర్యలూ తీసుకున్నాం.
– అంతేకాదు రైతుల విశాల ప్రయోజనాలను దష్టిలో పెట్టుకుని వచ్చే 30 నుంచి 35 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఎలాంటి ఢోకా రానివ్వకుండా 10వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌కోసం ప్రయత్నాలు ప్రారంభించాం.
– తద్వారా యూనిట్‌ కరెంటు రూ.2.5లకే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం.
– తద్వారా ప్రభుత్వానికి భారం తగ్గుతుంది, అంతేకాక ఉచిత విద్యుత్‌ పథకం స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగుతుంది.
– రైతులకోసమే ఈసోలార్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నాం.

– అంతేకాదు కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉచిత విద్యుత్తు రూపేణా ఎంత వాడుతున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది.
– ప్రభుత్వం ప్రత్యేక ఖాతాల్లోకి వేసే డబ్బును రైతులే డిస్కంలకు చెల్లిస్తారు.
– నాణ్యమైన కరెంటు, పగటిపూట 9 గంటల కరెంటు రాకపోతే రైతులు డిస్కంలను నిలదీయొచ్చు. సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చు.
– దీనివల్ల జవాబుదారీతనం, బాధ్యత పెరుగుతాయి.
– అధికారులకు కూడా రైతుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుంది.
– రైతులపై ఒక్కపైసా కూడా భారం పడదు.
– ప్రతినెలా రైతుల ఖాతాలకు డబ్బు చేరుతుంది. అదే డబ్బు నేరుగా డిస్కంలకు వెళుతుంది.
– ఉచిత విద్యుత్‌ పథకం మరింత మెరుగుపడుతుంది.
– దీనివల్ల చంద్రబాబుగారి ప్రభుత్వంలా బకాయిపెట్టే పరిస్థితులూ ఉండవు. అలాగే స్కీంను నిర్వీర్యం చేసే పరిస్థితులూ రావు.
– – ఉచిత విద్యుత్తకింద డిస్కంలకు బకాయిలుపెట్టే పరిస్థి లేకుండా
ప్రతినెలా రైతులకు డబ్బులు పడతాయి.. ఈడబ్బులు డిస్కంలకు వెళతాయి. దీనివల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయి.
– ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల్లో భాగంగా నాలుగు అంశాలను రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది అందులో ఉచిత విద్యుత్త పథకంలో సంస్కరణలు ఒకటి.
– మనసున్న ప్రభుత్వం మనది, రైతుల పక్షపాత ప్రభుత్వం మనది. రైతులకు అన్యాయం జరిగే ప్రశ్నే తలెత్తదు. ఒక్క పైసాకూడా నష్టం జరగదు.

– అసలు రైతులకు ఉచిత విద్యుత్తు పథకంమీద ఎవరికైనా పేటెంట్‌ ఉందంటే.. అది వైయస్సార్‌గారికి ఉంది. అందుకనే ఈపథకానికి వైయస్సార్‌ ఉచిత విద్యుత్తు పథకంగా పేరు పెడుతున్నాం.
– వైయస్సార్‌గారు రైతులను ఆదుకునే విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తే… మనం మరో రెండు– మూడు అడుగులు ముందుకు వేస్తున్నాం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను మరింత మెరుగ్గా ప్రజలకు అందిస్తున్నాం.
– ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాం.

– రైతులకు ఇప్పుడున్న కనెక్షన్లలో ఒక్కటి కూడా తొలగించం.
– రైతులకు ఎవరికైనా వర్తించకపోతే వారికి రెగ్యులరైజ్‌ కూడా చేస్తాం.
– ఒక్క కనెక్షన్‌ కూడా రద్దవుతుందన్న మాట రాకూడదని చాలా స్పష్టంగా అధికారులకు చెప్పాం.
– విద్యుశ్‌ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కాల్‌సెంటర్‌ కూడా పెడతాం. రైతులనుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు.
– ఉన్న ప్రతి కనెక్షన్‌ కూడా కొనసాగుతుంది.
– రైతులు ఎన్నియూనిట్లు కాలిస్తే.. అన్ని యూనిట్లరూ ప్రభుత్వం డబ్బు ఇస్తుంది.
– మనం మేనిఫెస్టోలో 9 గంటలపాటు ఉచిత విద్యుత్తు పగటిపూట ఇస్తామని హామీ ఇచ్చాం. ఆ మాటను అక్షరాల అమలు చేస్తాం. నాణ్యమైన కరెంటు ఇస్తాం.
– ప్రస్తుత సంస్కరణల వల్ల కౌలు రైతులకూ ఎలాంటి ఇబ్బందీ లేదు.
– ఎవరికి కనెక్షన్‌ ఉంటే.. వారి పేరుమీద ఖాతా తెరుస్తాం. వారికి డబ్బు నెలానెలా ఇస్తాం. ఆడబ్బు డిస్కంలను చేరుతుంది కాబట్టి కౌలు రైతులకు ఎలాంటి సమస్యా ఉండదు.
– ఉచిత విద్యుత్తు పథకం కింద ప్రభుత్వం బదిలీచేసే నగదును బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించుకోలేవు.
– మీటర్లకయ్యే ఖర్చును డిస్కంలు, ప్రభుత్వం భరిస్తాయి. రైతులకు ఎలాంటి భారం ఉండదు.
– గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో కమిటీలు ఉంటాయి.
– ఏడాదికి దాదాపు రూ.8వేల కోట్లకుపైగా ఉచిత విద్యుత్తుకోసం ఖర్చు అవుతుంది. దీనికయ్యే పూర్తిబాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.
– ప్రతి ఏటా రైతుకు దాదాపు రూ.49,600లకుపైగా ఉచిత విద్యుత్తు కింద ఖర్చు అవుతుంది.
– ఉచిత విద్యుత్తు పథకంలో సంస్కరణలు, దీనిపై వచ్చే సందేహాలకు పూర్తిస్థాయిలో సమాధానాలు ఇస్తూ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించాం.
– గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంచమని చెప్పాం.
– శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ప్రాజెక్టుగా అమలు, ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *