జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం కరప లో భారీ సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కాకినాడ పార్లమెంట్ జనసేన ఉపాధ్యక్షుడు దేవు మధు వీరేష్ తన సొంత నిధులు రూ 10 లక్షలు వెచ్చించి మండల కేంద్రం కరప మెరక వీధి లో సెన్సార్ సిస్టంతో పనిచేసే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
ప్రతి ఇంటికి ఉచితంగా శుద్ధిచేసిన 20 లీటర్ల మంచినీటిని పంపిణీ చేసే ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ సేవానిరతి కి నిదర్శనంగా మంచినీటి పంపిణీ చేపట్టడం అభినందనీయమని సోము వీర్రాజు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ దేశభక్తి మెండుగా ఉన్న నాయకుడు అని చెప్పిన సోము వీర్రాజు అందుకు జపాన్ ను ఉదాహరణ గా చెప్పారు .
కరోనా సమయంలో పనిచేసిన వారికి మధు విరేష్ సత్కారాలు చేశారు. కరప గ్రామంలో మంచినీటి సమస్య తీర్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అదేవిధంగా కేంద్ర నిధులు మంజూరు చేయించి బిజెపి నాయకులు కృషిచేయాలని మధు విరేష్ కోరారు. ఈ సందర్భంగా జనసేనాని పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. వారం రోజుల పాటు చేసిన సేవా కార్యక్రమాలు వివరించారు.
జనసేన నాయకులు జ్యోతుల వెంకటేశ్వరరావు, దేవు సూరిబాబు, పంతం నానాజీ,, మాజీ మేయర్ సరోజ, బిజెపి నాయకులు సూర్యనారాయణ రాజు, యేనిమిరెడ్డి మాలకొండయ్య, చిలుకూరి రామ్ కుమార్,సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, రాంబాల వెంకటేశ్వరరావు ఇతరులు పాల్గొన్నారు.మధు వీరేష్ మిత్ర బృందం సహాయ సహకారాలు అందించారు.