Raasi Phalalu 07-09-2020
🐐 మేషం
శుభకాలం. కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక వ్యవహారానికి సంబంధించి శుభవార్త వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఇష్టదైవాన్ని ధ్యానం చేయడం శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
కుటుంబసభ్యుల సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. గోసేవ మంచి చేస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
గ్రహబలం అనుకూలంగా ఉంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబసభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి మంచి ఫలితాలు అందుకుంటారు. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. శివారాధనతో మంచి ఫలితాలు అందుకుంటారు.
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
సంపూర్ణ మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.
💃💃💃💃💃💃💃
⚖ తుల
అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా నామాన్ని జపించడం ఉత్తమం.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
గ్రహబలం విశేషంగా ఉంది. శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మిశ్రమకాలం. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరిగేందుకు లక్ష్మీదేవి ధ్యానం చేయాలి
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ప్రారంభించిన పనుల్లో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీవారి దర్శనం శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదేవత ఆరాధన శుభఫలితాలు అందిస్తుంది.
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవంతు