రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రం పై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నారా లోకేష్ లేఖ.
-ఏపీ లోని పొందూరు,ధర్మవరం,ఉప్పాడ,మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.
-ఆగస్టు లో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల భారత పవర్‌లూమ్ బోర్డును రద్దు చేసింది.
-ఈ బోర్డుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, చేనేత నిపుణులు, ప్రతినిధులు సభ్యులుగా ఉండేవారు.
-ఈ బోర్డులు తరచూ సమావేశమై చేనేత అభివృద్ధి,సంక్షేమంపై కేంద్రానికి సిఫార్సులు చేసేది.
-చేనేత రంగంలో సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన,చేనేత రంగం ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించడం ఈ బోర్డుల ప్రధాన లక్ష్యం.
-నిరుద్యోగాన్ని తగ్గించి చేనేతను ఒక సమర్థవంతమైన వృత్తిగా మార్చడంలో ఈ బోర్డులు ఎంతగానో కృషి చేసాయి.
-దేశ,విదేశాల్లో చేనేత ల మార్కెట్లను విస్తరించడానికి ప్రణాళికలు రచించడం ఈ బోర్డుల ఉద్దేశ్యం.
-వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు,చేనేత యూనియన్ ల అభివృద్ధి చర్యలను సమర్థవంతంగా బోర్డులు సమన్వయం చేసేవి.
-ప్రభుత్వానికి-చేనేతల మధ్య ఉన్న ఏకైక వారధి అఖిల భారత చేనేత బోర్డు.
-నేతన్నకు అండగా నిలిచిన బోర్డులు రద్దు చెయ్యడం వలన చేనేత రంగం ఉనికి ప్రశ్నర్ధకంగా మారింది.
-కరోనా కారణంగా చేనేత రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది సంక్షోభంలో కూరుకుపోయారు.
-రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేతన్న నేస్తం అమలులో విఫలమైంది.10 శాతం మందికి మాత్రమే ఈ పథకం అందుతుంది.
-కేంద్రం 3బోర్డులను రద్దు చేయటం చేనేత, హస్తకళాకారుల పరిస్థితి దయనీయంగా మారింది.
-ఈ రంగాల పునరుద్ధరణ కు ఇప్పటికే కేంద్రానికి నా వంతుగా లేఖ రాశాను.
-గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రత కల్పించేందుకు వీటి పునరుద్ధరణ ఎంతో అవసరం
-రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల భారత పవర్‌లూమ్ బోర్డుల పునరుద్ధరణకు పోరాడుతుందని ఆశిస్తున్నా.