ఓజోన్ పొర పరిరక్షణ మనందరి బాధ్య‌త‌

ఓజోన్ పొర పరిరక్షణ మనందరి బాధ్య‌త‌
Spread the love

ఓజోన్ పొర పరిరక్షణ మనందరి బాధ్య‌త‌

మేల్కొంటేనే మనుగడ: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నేడు అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

వాతావరణంలో సహజ రక్షణ పొరగా ఉన్న ఓజోన్ పొర రక్షించుకునే బాధ్యత ప్ర‌భుత్వంతో పాటు ప్రతీ ఒక్కరిపై ఉందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని భూగోళంపై కవచంలా ఉంటూ సమస్త జీవకోటికి రక్షణ కల్పిస్తున్న ఓజోన్‌ పొర ప్రాధ‌న్య‌త‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గుర్తు చేశారు. కాలుష్యరహిత పరిసరాలతో, జీవన వైవిధ్యంతో ప్రాణకోటి విలసిల్లాలన్నా, మానవులు సుఖశాంతులతో ప్రశాంతంగా బతకాలన్నా పర్యావరణ సమతౌల్యంతోనే అది సాధ్య‌మ‌వుతుంద‌ని మంత్రి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ప్రకృతి బాగుంటే అందులో భాగమైనమైన స‌క‌ల జీవ‌కోటి బాగుంటుందని, ప్రకృతిలో భాగమైన ఓజోన్ పొర లేకుండా జీవితం సాధ్యం కాద‌ని ఆయ‌న అన్నారు. అందుకే ఈ సంవత్సరం ఓజోన్‌ పరిరక్షణ దినం సందర్భంగా మన జీవితం కోసం ఓజోన్ అనే నినాదాన్ని ఇచ్చారని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఓజోన్‌ రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపడుతోందని
ఈ సంద‌ర్బంగా తెలిపారు. వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని త‌గ్గించ‌డంలో చెట్ల‌ కీల‌క‌పాత్ర పోషిస్తాయ‌ని, అందుకే సీయం కేసీఆర్ హ‌రిత‌హారం ద్వారా పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యాక్ర‌మానికి శ్రీకారం చుట్టార‌న్నారు. ప్ర‌కృతి సంప‌ద‌ను కాపాడ‌టంతో పాటు జ‌ల‌, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అన్ని చ‌ర్య‌ల‌ను పీసీబీ తీసుకుంటుందని తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, ఓజోన్‌ పొరకుహాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి, శాస్త్ర‌, సాంకేతిక మండ‌లి అవ‌గాహన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంద‌న్నారు.

రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, విమానాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్‌ కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలై భూమిని ఆవరించి ఉన్న ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్నాయ‌ని, వీటిని వినియోగించడం తగ్గిస్తేనే పర్యావరణానికి మేలు జరుగుతుంది.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *