Monument to the martyrs of Telangana
హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో లుంబిని పార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “తెలంగాణ అమరవీరుల స్మారక స్మృతి చిహ్నం” నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి. మంత్రి వెంట ఎమ్మెల్యే శ్రీ ఫైళ్ల శేఖర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….”సీఎం కేసీఆర్ రాజీలేని పోరాటం, ఎందరో అమరుల త్యాగఫలితంతో తెలంగాణ సాధించుకుని.. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలిచింది. తెలంగాణ అమరవీరుల స్మారకార్థం హైదరాబాద్ నడిబొడ్డున బ్రహ్మాండమైన స్మారకం ఏర్పాటు చేయాలని సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయించారు.
ప్రపంచమే అబ్బురడేలా హుస్సేన్ సాగర్ తీరాన పనులు జరుగుతున్నాయి. ఎవరు హైదరాబాద్ వచ్చినా తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేలా స్మారకం ఉండాలన్నది సీఎం గారి ఆలోచన. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ప్రముఖులు హైదరాబాద్ వస్తే తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించే సంప్రదాయం ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. డిల్లీలో బాపూజీకి నివాళి అర్పించే తరహాలో ఇక్కడ అమరవీరులకు నివాళి అర్పించే సంప్రదాయం రావాలి. డబ్బుకు వెనకాడకుండా ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. విభిన్నంగా అమరవీరుల స్మారకం నిర్మాణం జరుగుతుంది. 350 కార్లు, 600 బైక్ లు పట్టేలా పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి అంతస్థులో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, సమావేశ మందిరం, ఆర్ట్ గ్యాలరీ ఉంటాయి.
తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి త్యాగాలు ప్రతిబింబించేలా సందర్శకుల కోసం ఫోటో గ్యాలరీ ఉంటుంది. 2వ అంతస్థులో జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించేలా బెస్ట్ కన్వెన్షన్ హాల్ ఉంటుంది. 3వ ఫ్లోర్లో రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతోంది. అమరుల త్యాగాలు వెలకట్టలేనివి, అమరవీరుల స్థాయికి ఏ మాత్రమ తగ్గకుండా నిర్మాణం ఉండాలని సీఎం శ్రీ కేసీఆర్ స్పష్టం చేశారు. ఆరు నెలల కాలంలో పూర్తి చేయాలని అనుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించేలా స్మారకం ఉంటుంది.” అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.