పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, డివిజన్ పార్టీ బాధ్యులు
చంద్రబాబు, టిడిపి అధినేత
ప్రలోభాలకు లోనై పార్టీకి ద్రోహం చేయడం హేయం
వ్యక్తిగత స్వార్ధంతో పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలే బుద్ది చెబుతారు
ఎన్నికష్టాలు ఎదురైనా కార్యకర్తలు టిడిపి వెన్నంటే ఉంటారు.
స్వార్ధంతో ఒకరిద్దరు పార్టీనుంచి పోయినా నష్టం లేదు
నాయకులు వస్తారు పోతారు, పార్టీ శాశ్వతం, కార్యకర్తలు శాశ్వతం
కార్యకర్తల అభిమానం, ప్రజాదరణ తెలుగుదేశం సొంతం.
జెండాను మోసి గెలిపించేది కార్యకర్తలే..
జెండా పంచన చేరిన నాయకులు కొందరు పార్టీకి ద్రోహం చేయడం దుర్మార్గం
ద్రోహులకు తెలుగుదేశం పార్టీలో స్థానం లేదు. ప్రజల గుండెల్లో నుంచి టిడిపిని ఎవరూ తొలగించలేరు
పార్టీకి ద్రోహం చేసినవాళ్లకు రాజకీయ సమాధే
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కంచుకోట.
హుద్ హుద్ లో టిడిపి కష్టాన్ని ప్రజలు మరిచిపోరు.
టిడిపి 5ఏళ్ల పాలనలో విశాఖ అభివృద్దికి పెద్దపీట. వేలకోట్ల పెట్టుబడులు విశాఖకు తెచ్చాం,
లక్షలాది ఉద్యోగాలు కల్పించాం.
అందుకే విశాఖ పట్టణంలో 4అసెంబ్లీ స్థానాల్లో టిడిపిని గెలిపించారు.
వైసిపి వచ్చాక అన్నింటినీ నాశనం చేస్తోంది.
వేలాది ఎకరాల భూములు కబ్జా చేశారు,
ప్రశాంతంగా ఉండే విశాఖలో వైసిపి దందాలు.
ఇళ్లస్థలాల ముసుగులో ల్యాండ్ స్కామ్ లు చేశారు, లెవలింగ్ పేరుతో వేల కోట్లు స్వాహా చేశారు.
ప్రతి స్కీమ్ లో స్కామ్ లకు పాల్పడ్డారు.
మొదట టిడిపి కార్యకర్తలు,నాయకులపై దాడులు చేశారు.
తర్వాత బిసిలపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ తర్వాత దళితులపై దమనకాండకు దిగారు.
చివరికి దేవాలయాలపై దాడులకు కూడా తెగబడ్డారు.
ప్రతి జిల్లాలో వైసిపి శాండ్-ల్యాండ్, మైన్-వైన్ మాఫియా మూకలు పేట్రేగి పోయాయి.
వైసిపిపై ప్రజల్లో అసహ్యం పెరిగింది. వైసిపి దుర్మార్గాలపై ప్రజలే తిరుగుబాటు.
వైసిపి అవినీతి-అరాచకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.
వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫిరాయింపులకు
జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం. వైసిపి ప్రలోభాలకు కొందరు లొంగిపోయి పార్టీకి ద్రోహం చేయడాన్ని ఖండిస్తున్నాం.
నీతి నిజాయితీ, చిత్తశుద్ది లేని పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ .
వైసిపి మైండ్ గేమ్ ను, కుట్రలను ప్రజలే తిప్పికొట్టాలి.
టిడిపి కార్యకర్తలంతా కలిసికట్టుగా పని చేయాలి.