ఇకపై పౌరుల‌కు అన్ని సేవ‌లు ఒకే చోట

ఇకపై పౌరుల‌కు అన్ని సేవ‌లు ఒకే చోట
Share this news

రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్ర‌మాణాల పెంపుపై ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ప‌లు శాఖ‌ల అధిప‌తులు హాజ‌ర‌య్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్ర‌మాణాల‌ను పెంచేందుకు నూత‌న సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మ‌రింత‌గా పెంచుతామ‌ని స్ప‌ష్టం చేశారు. నూత‌న సంస్క‌ర‌ణ‌లతో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయ‌న్నారు.

పౌరుల‌కు అన్ని సేవ‌లు ఒకే చోట అందించేందుకు సిటీజన్ స‌ర్వీస్ మేనేజ్‌మెంట్ పోర్ట‌ల్‌కు ప్ర‌తిపాద‌న చేశారు కేటీఆర్. శాఖ‌ల ప‌రంగా చేప‌ట్టే సంస్క‌ర‌ణ‌ల‌తో ఆయా శాఖ‌ల ప‌నితీరులో సానుకూల మార్పులు చేయాల‌న్నారు. టీఎస్ బీపాస్ చ‌ట్టంపై కూడా మంత్రి కేటీఆర్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఎస్ బీపాస్ అనేది చారిత్రాత్మ‌క చ‌ట్ట‌మ‌ని పేర్కొన్నారు. చ‌ట్టం అమ‌లులో వివిధ శాఖ‌ల స‌హ‌కారం, స‌మ‌న్వ‌యం అవ‌స‌ర‌మ‌న్నారు. టీఎస్ బీపాస్ అనుమ‌తుల‌కు సంబంధించి అవ‌స‌రం ఉన్న ప్ర‌తి శాఖ నుంచి ఒక్కొక్క నోడ‌ల్ అధికారిని ప్ర‌త్యేకంగా నియ‌మించాల‌ని ఆదేశించారు. త్వ‌ర‌లోనే ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేసేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.


Share this news

tanvitechs

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *