Pawan Kalyan congratulated the BJP working committee members
బి.జె.పి.కార్యవర్గం సభ్యులకు శుభాభినందనలు
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో నియమితులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలుపుతున్నాను. భారతీయుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో ఈ నూతన కార్యవర్గం సఫలమవుతుందన్న విశ్వాసం ఉంది. కార్యవర్గం కూర్పులో పార్టీ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు చూపిన విజ్ఞత ఎంతైనా కొనియాడదగినది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారికి ప్రధాన కార్యదర్శిగా, శ్రీమతి డి.కె.అరుణ గారు ఉపాధ్యక్షురాలిగా నియమితులు కావడం హర్షణీయం. అదే విధంగా మరోసారి కార్యదర్శులుగా నియమితులయిన శ్రీ సత్యకుమార్ గారు, శ్రీ సునీల్ దియోధర్ గారు, ఓ.బి.సి. మోర్చా అధ్యక్షులుగా నియమితులైన శ్రీ కె.లక్ష్మణ్ గారికి నా తరపున, జనసేన పార్టీ తరపున అభినందనలు తెలుపుతున్నాను.
(పవన్ కల్యాణ్)
అధ్యక్షులు, జనసేన



TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.