దేవాలయాల పై జరుగుతున్నా దాడులపై మాట్లాడిన డీజీపీ గారు

Spread the love

దేవాలయాల పై జరుగుతున్నా దాడులపై మాట్లాడిన డీజీపీ గారు

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన 19 కేసులు నమోదు చేశాం: డిజిపి

అతి స్వల్ప సమయంలోనే 12కేసులను చేదించి నిందితులను అరెస్టు చేశాం, ఏడు కేసులు దర్యాప్తులో ఉన్నాయి: డిజిపి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మతాలకు చెందిన 47,359 దేవాలయాలు, ప్రార్ధన మందిరాలను గుర్తించాం, వాటికి మ్యాపింగ్, ఆడిట్ పూర్తి చేశాం:డిజిపి

ప్రతి ఒక్క దేవాలయానికి పూర్తి స్థాయిలో భద్రత చర్యలు తీసుకోవాల్సిందిగా సంభందిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశాం:డిజిపి

గడిచిన రెండు వారాలలో 886 దేవాలయాల వద్ద పోలీస్ శాఖ ద్వారా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం:డిజిపి

ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా దేవలయాలు/దేవాలయ ఆస్తులపై జరిగిన దాడులపై కొన్ని వర్గాలు తమ స్వార్ధ ప్రయోజనాలను కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వాటి పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కోరుతున్నాం.

ఏపీ డి‌జి‌పి మాట్లాడుతూ అంతర్వేది సంఘటన మొదలుకొని ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు /ఆలయ ఆస్తులపై దాడిసంభందించి మొత్తం వివిధ ప్రాంతాలలో 19 కేసులో నమోదు కాగా ఇప్పటికే అతి స్వల్ప సమయంలోనే 12 కేసులను చేదించి నిందితులను అరెస్టు చేయడం జరిగింది.మరో ఏడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.త్వరలోనే కేసులను చెదిస్తామన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నాము. ఈ కేసులన్నీ కూడా ఒక కేసు తో ఇంకో కేసుకు సంబంధం లేదు, కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ సంఘటనలన్నింటికి సంబంధాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నట్లుస్పష్టంగా కనిపిస్తుంది.

ఈ సంఘటనలకు సంబంధంచిన పూర్తి వాస్తవాలను ప్రజలకు అందించాల్సిన భాధ్యత మాపై ఎంతైనా ఉంది.
ఉదాహరణకు శ్రీకాకుళం సంఘటనలో విగ్రహం చేయిని ద్వంసం చేసినట్లు ఆరోపించారు. కేసు దర్యాప్తులో అది గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల కరణంగా విగ్రహం చేయి పడిపోయినట్లు తేలింది. అదే విధంగా కర్నూలు సంఘటన విషయానికి వస్తే, విగ్రహం లోని కొన్ని అంతర్గత భాగాలను తొలగిస్తే తన భార్య గర్భం ధరిస్తుందని మూడనమ్మకం తో ఈ దారుణానికి పాల్పడినట్లు పట్టుబడిన నిందితుడు వెల్లడించాడు. మరికొన్ని సంఘటనలలో విగ్రహాల క్రింద దాగి ఉన్న గుప్తనిధుల కోసం వేటాడుతున్న ముఠాలు దాడులకు పాల్పడ్డయి.ఈ సంఘటనలన్నీ వేర్వేరు ఉద్దేశాలతో జరిగిన దాడులు.
దేవాలయాలు/ప్రార్థనా స్థలాల వద్ద భద్రత కోసం పోలీసు శాఖ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల గురించి డిజిపి మాట్లాడుతూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 47593 ప్రార్థనా స్థలాలను గుర్తించి వాటిని మ్యాపింగ్, ఆడిట్ పూర్తి చేశాము.వాటిలో 28,567 దేవాలయాలు ఉండగా కేవలం 10% మాత్రమే సిసిటివి కెమెరాలు ఉన్నాయి. సిసిటివిలను ఏర్పాటు చేయడం, అదే విధంగా నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ బహిరంగ ప్రదేశాల భద్రతా చట్టం 2013 మేరకు పూర్తి స్థాయిలో దేవాలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు అమర్చడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు,దేవాలయాలకు ఫైర్ & ఎలక్ట్రిసిటీ ఆడిట్ నిర్వహించడం, నిరంతరం రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షణ చర్యలు చేపట్టే విధంగా అవగాహన కల్పించడం తోపాటు పెట్రోలింగ్ ను పటిష్టపరచడం, సోషల్ మీడియా పుకార్లపై నిఘా, మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు పుకార్లు నమ్మకుండా శాంతిభద్రతలకు సహకరించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించాం. రెండు వారాలలో 886 దేవాలయాల వద్ద స్వయంగా పోలీస్ శాఖ ద్వారా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం.అదే విధంగా గత 6 సంవత్సరాలలో ఇలాంటి నేరాలకు పాల్పడిన మొత్తం 8204 మందిని బౌండ్ ఓవర్ చేశాము.
తాజాగా నిన్న సాయంత్రం చిత్తూరులోని ఒక ఆలయంలోని నంది విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ద్వంసం చేసినట్లు ఫిర్యాదు అందిందని దానిపైన అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని అదే విధంగా నిర్లక్ష్యం వహించిన ఆలయ నిర్వహకులకు నోటీసులు జారీ చేశామన్నారు.
రాష్ట్ర విభజన తరువాత(2015-2020)రాష్ట్రం లో దేవాలయాల పైన జరిగిన దాడులతో పోల్చుకుంటే 2020 లో కేవలం 228 మాత్రమే జరిగినట్లు గణాంకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సంవత్సరం వారీగా డేటా క్రింద ఇవ్వబడింది:

2015: 290
2016: 322
2017: 318
2018: 267
2019: 305
2020: 228

ఆంధ్రప్రదేశ్ పౌరులకు విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియా పుకార్లపైన, మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు పుకార్లు నమ్మకుండా శాంతిభద్రతలకు సహకరించే విధంగా ఉండాలని అదే విధంగా ప్రజలకు ఏమైనా అనుమానాలు ఉన్న, వారి వద్ద ఉన్న విలువైన సమాచారం దగ్గరలో పోలీసులకు నేరుగా సంప్రదించి అందించాలని కోరుతున్నాం.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *