రాష్ట్రాభివృద్ధిలో చంద్రబాబు, జగన్‌ల పాత్ర సున్నా – సోమువీర్రాజు

రాష్ట్రాభివృద్ధిలో చంద్రబాబు, జగన్‌ల పాత్ర సున్నా – సోమువీర్రాజు
Spread the love

ఎపీ అభివృద్ధిలో జగన్‌, చంద్రబాబు పాత్ర సున్నాగా పోల్చుతూ రాష్ట్రాభివృద్ధి మొత్తం భాజపాతోనే ముడిపడి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు స్పష్టం చేశారు. నంద్యాలలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్రాభివృద్ధి భాజపా లక్ష్యమని అన్నారు. భాజపా అజెండానే అభివృద్ధిగా వివరించారు. తెదేపా, వైకాపా పార్టీలది అవినీతి, వారసత్వ, కుల రాజకీయాలు అజెండాగా పేర్కొన్నారు. చంద్రబాబు, జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకరిమీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చాక దోచుకుతినడాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎంతసేపు పోలవరం ఎత్తు, రాజధానుల సంఖ్యపై తప్ప వాస్తవంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. తేదేపా, వైకాపాలు కర్నూలుకు అన్యాయం చేశాయని, అక్కడి సమస్యలు పరిష్కరించక గాలికి వదిలేశాయని ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాకు భాజపా మాత్రమే మేలు చేసిందని, జిల్లాకు చేసిన అభివృద్ది కార్యక్రమాలను వరుసగా వివరించారు. ఇంకా ఆయన ఇలా అన్నారు….

రాజధాని నిర్మాణాన్ని రూ.55 వేల కోట్లకు అక్రమంగా పెంచాడని అరోపించిన జగన్‌ తిరిగి ఆదే మొత్తాన్ని అడుగుతున్నారు. చంద్రబాబు తన పాలనలో రూ.7,200 కోట్లు ఖర్చుచేసి రాజధానికి, రైతులను అన్యాయం చేసి ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడుతున్నారు. జగన్‌ 3 రాజధానులని చెబుతున్నారు. కర్నూలులో రాజధాని ఎందుకు పెట్టరు. వారివి కృత్రిమ అజెండాలు. నిజమైన అజెండాను రాష్ట్రంలో తెరమీదకు తెస్తుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో కూడి మొత్తం రాష్ట్రాభివృద్ధి భాజపా లక్ష్యం. దీనిపై చర్చ జరగాలి.

రాయలసీమలో తాగడానికి నీరు లేవా? నిరక జలాలు లేవా? హంద్రీ-నీవా, గాలేరు-నగరి ముచ్చటగా మారిందా? పోలవరం గురించి తప్ప గాలేరు-నగరిపై చంద్రబాబు మాట్లాడటం లేదు. ఒకే రాజధాని అంటున్నారు. కాని రాయలసీమ గురించి మాట్లాడటం లేదు. జగన్‌ హంద్రీనీవా గురించి మాట్లాడరు. తుంగ్రభద్రకు 11 టీఎంసీల నుంచి 31 టీఎంసీల నీరు తెచ్చే సమాంతర కాలువకు అవకాశం ఉన్నా మాట్లాడరు. అలుగు గురించి మాట్లాడారు. ఎంతసేపు రాజధాని గురించే మాట్లాడతారు. .అబివృద్ధికి విఘాతమైన అజెండాలు అమలుచేస్తున్నారు. భాజపా దీనిని తిప్పికొడుతుంది. చంద్రబాబు 3 లక్షల కోట్లు అవినీతి ఆరోపించి పెద్ద పుస్తకం వేసి రూ.150 కోట్లు అవినీతి ఆరోపణలపై ఒక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. ఈరోజు ఎపీలో తెదేపా, వైకాపా రెండూ ఒక కూటమిగా మారారు. అవినీతి గురించి మాట్లాడిన జగన్‌ ఎందుకు చర్యలు తీసుకోరు? మా అజెండా అభివృద్ధి, కుటుంబపాలనకు వ్యతిరేకం. రాయలసీమ అబివృద్ధి చేస్తాం. అన్ని జిల్లాల్లో మోదీ అభివృద్ధి ఉంది.

లాక్‌డౌన్‌ కష్టకాలంలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 40 లక్షల మందికి 195 కోట్లు జాతీయ వేతనాలు అందించాం. మైనార్టీలకు ఆర్ధికసహాయం ఇచ్చారు. బోధనాసుపత్రులు జగన్‌వి కావు. కర్నూలు-నంద్యాల, తిరుపతి జాతీయ రహదారి నిర్మిస్తున్నాం. రాష్ట్రానికి 23 లక్షల ఇళ్లు కేటాయింపు. రూ.122 కోట్లతో కల్వకుర్తి-కర్నూలు-హైదరాబాదు రహదారి విస్తరిస్తున్నాం.

రాష్ట్రానికి కేటాయించిన 23 లక్షల ఇళ్లకు ఒక్కోదానికి రూ.1.50 లక్షల చొప్పున రూ.25 వేల కోట్లు మోదీ ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. అయితే జగన్‌ 15 లక్షల ఇళ్లే కడతానంటున్నాడు. 8 లక్షల ఇళ్లు వదిలేశారు. అదికూడా కలిపితే మరో రూ.12 వేల కోట్లు వచ్చేవి. మొత్తం 5 ఏళ్లలో రూ.36 వేల కోట్లు రాష్ట్రానికి లభించేది.

నిధులు ఇవ్వమని పోలవరం గురించి అసత్యప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి గురించి మేం స్పష్టంగా ఉన్నాం. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా త్రిపుల్‌ ఐటీ నిర్మాణం చేపట్టాం. కర్నూలుకు క్లస్టర్‌ వర్శిటీకి అనుమతి లభించింది.రూ.10వేల కోట్లతో కర్నూలుఓ డీఆర్‌డీఏ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చి ఇప్పటికే రూ.4 వేల కోట్లు విడుదల చేశారు. నంద్యాల-గుండ్రేవుల-తుంగభద్రకు అనుమతి. సోలార్‌పార్కు నిర్మాణంలో ఉంది. కేంద్రం ఏంచేయడం లేదు. చంద్రబాబు, జగన్‌ ఏమైనా ఇలాంటివి చేశారా? ఎపీ, రాయలసీమ అభివృద్దిలో భాజపా ప్రముఖంగా పాల్గొంటుంది. ఎమ్మెల్యేల రాజకీయం కోసం సీడ్‌ పార్కుస్ధానంలో బోధనాసుపత్రి నిర్మించాలనుకోవడం సరికాదు. ఇక్కడ వేల కోట్ల మౌలికసదుపాయలున్నాయి. అందువల్ల అక్కడ కాకుండా వేరేప్రాంతంలో పెట్టాలి. 30 లక్షల పట్టాలిస్తామని విచ్చలవిడి ధరలకు స్థలాలు కొన్నారు. ఎకరా రూ.5 లక్షల ఉంటే రూ.25 లక్షలకు కొన్నారు. అక్కడ మేం రూ.3 వేల కోట్లతో రోడ్లు వేశాం. రూ.25 వేల కోట్లు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్నాం. ఇళ్లు కేంద్రానివా, జగన్‌వా? కేంద్రం ఒక ఇంటికి ఇచ్చే సబ్సిడీ రూ.1.50 లక్షలతో పాటు నరేగాలో రూ.60 వేల కూడా ఇస్తున్నారు. ఆ దృష్ట్యా ఎపీ అభివృద్ధిలో జగన్‌, చంద్రబాబు పాత్రలేదు. రాష్ట్రాభివృద్ధి భాజపాతోనే సాధ్యం.

వ్యవసాయ చట్టాలపై సదస్సు

తర్వాత నంద్యాలలో కార్యకర్తలను, రైతులను ఉద్దేశించి కేంద్రం ప్రభుత్వం చేసిన రైతుచట్టాలపై ప్రసంగించారు. ఉప ఎన్నికల్లో భాజపా గెలవడంతో రాష్ట్రంలోనూ గెలుస్తుందని భయంతో వైకాపా, తెదేపా, కమ్యూనిస్టులు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలుచేస్తున్నారని విమర్శించారు. అనంతరం కర్నూలులో భాజపా రాష్ట్ర నాయకురాలు మీడియా ప్యానలిస్ట్‌ డాక్టర్‌ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో 500 మంది భాజపా కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించారు. భాజపా కర్నూలు జిల్లా అధ్యక్షులు పి.రామస్వామి, నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ బుడ్దా శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, చిరంజీవి రెడ్డి,శశిభూషన్ రెడ్డి,నాయకులు డాక్టర్‌ పార్దసారధి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి, కపిలేశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: