ప్రమాదం లో గాయపడ్డ ఆట్రో డ్రైవర్ కు ఆర్థిక సాయం అందచేసిన జనసేన నాయకులూ జైరాం గారు.

Share this news

ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఉపాధి కోల్పోయిన సారవకోట వాస్తవ్యుడు హరిని కలిసి పరామర్శించారు జనసేన పార్టీ నరసన్నపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు జయరాం గారు. ప్రమాదం జరిగిన వివరాలను అడిగి తెలుసుకుని విచారణ వ్యక్తం చేసారు.

ప్రస్తుతం హరి పరిస్థితి చూసి చలించి ఆయన కుటుంబానికి నెలకి సరిపడా నిత్యవసర సరుకులని అందించారు.అదేవిధంగా భవిష్యత్తులో హరికి ఎటువంటి అవసరం ఉన్నా తనకి అండగా నేనుంటానని,తనకి ఎటువంటి సహాయం కావాలన్నా జనసేన పార్టీ అండగా ఉంటుందని,భవిష్యత్తు పై హరి దిగులు చెందాల్సిన అవసరం లేదని,త్వరలోనే రవి పూర్తిగా కోలుకుంటాడాని అందుకు అన్నివిధాలుగా సహకారం చేసేందుకు మేమున్నామని జయరాం గారు భరోసా ఇచ్చారు.

తమ పార్టీ సిద్ధాంతాలు,తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలే ఇలా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయని,సామాన్య ప్రజలకు అండగా ఉండటం,ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం,మరియు ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం అందించేందుకు కృషి చేయడమే జనసేన పార్టీ లక్ష్యమని అందుకోసం తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు జయరాం గారు. జనసేన నాయకులు తమని ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని హరి తెలిపారు.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *