నిమ్మగడ్డకు పోలీస్ సంఘం షాక్!

నిమ్మగడ్డకు పోలీస్ సంఘం షాక్!
Spread the love

✅మీ ఎన్నికల తొందర కోసం మా ప్రాణాలను , ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేం ….. పోలీస్ అసోసియేషన్

✅మన గౌరవ ప్రధాన మంత్రి గారి కృషి మరియు స్ఫూర్తితో మన యువ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో కోవిడ్ పై నియంత్రణ సాధిస్తున్న ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణ వలన ఇన్ని రోజుల శ్రమను వృదా అయ్యి కథ తిరిగి మొదటికి వచ్చే అవకాశం ఉంది.

✅అకస్మాత్తుగా విడుదల చేసిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ పోలీస్ సిబ్బందిని ఆందోళనకు గురి చేసింది.

✅కోవిడ్ మహమ్మారి వలన 109 మంది పోలీస్ సిబ్బంది ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు.

✅14,000 మంది కోవిడ్ బారిన పడ్డారు . అనేక మంది ఇప్పటికీ పాజిటివ్ గా ఉన్నారు.

✅అంతే కాక ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే ప్రక్రియలొ పోలీస్ సిబ్బంది అనేక బాధ్యతలు నిర్వహించాలి. వ్యాక్సిన్ రవాణా, నిల్వకు పోలీస్ బందోబస్తు నిర్వహించవలసి ఉంటుంది మరియు వాక్సిన్ వేసే ప్రక్రియలో కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి.

✅అంతకాక పోలీస్ సిబ్బంది అందరు వాక్సిన్ చేయించు కోవాలి.

✅ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వకుండ ఎలక్షన్ విధులకు హాజరు అవ్వడం పోలీస్ సిబ్బంది ప్రాణాలను, ప్రజల ప్రాణాలను పెను ప్రమాదంలో పెట్టినట్టే.

✅అందువలన వాక్సినేషన్ ప్రక్రియ మొత్తం ముగిసే వరకు ఎలక్షన్ విధుల ను పోలీస్ సిబ్బంది నిర్వహించలేరు. మా కుటుంబ సభులను, ప్రజలను ప్రమాదంలో పెట్టలేం.

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం

tanvitechs

tanvitechs

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *