పేదలకు ఉచిత MRI, CT-Scan‌

పేదలకు ఉచిత MRI, CT-Scan‌
Spread the love

అమీర్‌పేట, ఫిబ్రవరి 2: దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న 10,000 మంది రోగులకు ఉచిత ఎంఆర్‌ఐ, సిటి స్కాన్‌లను అందించడానికి అమీర్‌పేటలోని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ముందుకు వచ్చింది.

ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్ తన 34 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఉచిత సేవలను అందిస్తున్నట్లు ఎండి డాక్టర్ సతీష్ రెడ్డి, సిఇఒ కేటీ దయానంద్ మంగళవారం మీడియాతో అన్నారు. సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) లో భాగంగా ఈ ఏడాది 10,000 ఎంఆర్‌ఐ, సిటి స్కాన్‌లను ఉచితంగా చేస్తారు.

సంబంధిత వైద్య నిపుణుల నుండి స్కాన్ చేయవలసిన అవసరాన్ని సూచించే లేఖను రోగి అందించాల్సి ఉంటుందని వెల్లడించారు. పేదలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆస్టర్ ప్రైమ్ యాజమాన్యం ఈ భారీ పథకాన్ని ప్రారంభించిందని, ఈ అవకాశాన్ని పొందడానికి www.asterdmhealthcare.com వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 040-4959 4959 ను సంప్రదించండి.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *