ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు – నేడు కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి ఇతర ఉన్నతాధికారులు హాజరు.
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే…:
రెండో విడత నాడు – నేడు పనులకు సిద్ధం కావాలి అధికారులకు సీఎం ఆదేశం
మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా నాడు – నేడు కార్యక్రమాలను ప్రారంభించాలి : సీఎం ఆదేశం
పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు స్పష్టంచేసిన సీఎం
రెండో విడత నాడు – నేడు పనులను ఏప్రిల్ 15 నుంచి ప్రారంభిస్తామన్న అధికారులు
డిసెంబర్ 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేసుకున్నామన్న అధికారులు
రెండో విడత నాడు – నేడు పనులకోసం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
మొదట విడత నాడు–నేడు కోసం సుమారు రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
స్కూళ్లను బాగు చేయడానికి ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్న అధికారులు
స్కూళ్ల పునఃప్రారంభం, స్కూళ్లకు పిల్లలు హాజరుపై అధికారులనుంచి వివరాలు కోరిన సీఎం
పిల్లల హాజరుపై యాప్‌ను రూపొందించారా? లేదా? అని ప్రశ్నించిన సీఎం
ఫిబ్రవరి 15 నుంచి పిల్లల హాజరుపై యాప్ ద్వారా వివరాలు సేకరిస్తామన్న అధికారులు
పిల్లలు స్కూల్‌కు గైర్హాజరైన పక్షంలో ఎస్‌ఎంఎస్ తల్లిదండ్రులకు వెళ్లాలని, రెండో రోజు నేరుగా వలంటీర్‌ను పంపి వివరాలు కనుక్కోవాలని స్పష్టంచేసిన సీఎం
ఈ విధానం సమర్థవంతంగా అమలు కావాలి : సీఎం
‘‘గోరు ముద్ద’’పై సీఎం సమీక్ష
గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలన్న సీఎం
నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులకు సీఎం ఆదేశం
పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపైనా సీఎం సమీక్ష
టాయిలెట్ల నిర్వహణకు సులభ్ ఇంటర్నేషనల్‌తో అవగాహనా ఒప్పందం
టాయిలెట్ల నిర్వహణకోసం దాదాపు 49వేలమంది సిబ్బంది
టాయిలెట్ల నిర్వహణపై ఎస్‌ఓపీ
టాయిలెట్ నిర్వహణా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్న సులభ్ ఇంటర్నేషనల్