వ్యాక్సిన్ కేంద్రప్రభుత్వ పరిదిలోనిది – మంత్రి జగదీష్ రెడ్డి

వ్యాక్సిన్ కేంద్రప్రభుత్వ పరిదిలోనిది – మంత్రి జగదీష్ రెడ్డి
Spread the love

వ్యాక్సిన్ కేంద్రప్రభుత్వ పరిదిలోనిది – మంత్రి జగదీష్ రెడ్డి

*ఐ సి యం ఆర్ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి.*

*అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్లోబల్ టెండర్లకు అనుమతి కోరారు.*

*మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ*

*కమిటీ కేంద్రప్రభుత్వం తో సంప్రదిస్తుంది.

*విధి విధానాలు రాగానే వ్యాక్సిన్ అందజేస్తాం

మెరుగైన వైద్యంఅందించాలనిముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం

కోవిడ్ పరీక్షలు అందరికీ అక్కర్లేదు

అనుమానితులకు తప్పనిసరిగా పరీక్షలు

వైద్య సర్వేలో అనుమానితుల గుర్తింపు

అందుబాటులో ఐసోలేషన్ కేంద్రాలు

ఏ ఒక్కరూ భయాందోళనకు గురికావొద్దు

#హుజుర్నగర్, కోదాడ లలో వీలు పడకపోతే సూర్యాపేటలో నూ ఐసోలేషన్#200 పడకల ఐసోలేషన్ రెడీ చేశాం

వైద్యం తో సహా భోజనాది సౌకర్యాలు 184 గ్రామ పంచాయతీ లలో 8,5531 ఇండ్లలో వైద్య సర్వే పూర్తి 3,289 మందిని గుర్తించాం 2,486 మెడికల్ కిట్ల పంపిణీ

-మంత్రి జగదీష్ రెడ్డి

హుజుర్నగర్ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ పై ప్రత్యేక సమీక్షా సమావేశం హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి*కోవిడ్ పరీక్షలు,వ్యాక్సిన్ సరఫరా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిదిలోనిదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఐ సి యం ఆర్ నిబంధనలు దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్లోబల్ టెండర్లకు అనుమతులు కోరారని ఆయన చెప్పారు. టి ఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక మరియు ఐటి శాఖామంత్రి కలువకుంట్ల తారకరామారావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని వేసిందని ఆయన గుర్తుచేశారు.

కోవిడ్-19 పై సోమవారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ ఏరియా ఆసుపత్రిలో స్థానిక శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సూర్యాపేట డి యం హెచ్ ఓ కోటాచలం,డిప్యూటీ డి యం హెచ్ ఓ హర్షవర్ధన్, డి సి హెచ్ వెంకటేశ్వర్లు,ఏరియా ఆస్పత్రి సూపరెండేంట్ కరుణ్ కుమార్ లతో పాటు జడ్ పి టి సి సైదిరెడ్డి, యం పిపి గుడెపు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,స్థానిక ఆర్ డి ఓ వెంకారెడ్డి,యం ఆర్ ఓ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ అధ్యక్షతన వేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వం తో సంప్రదిస్తుందని విధి విధానాలు రాగానే వ్యాక్సిన్ ను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

మెరుగైన వైద్యం అంసించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు. కోవిడ్ పరీక్షలు అందరికి అక్కరలేదని అనుమానితులు మాత్రం విధిగా చేపించుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య సర్వేలో అనుమానితులను గుర్తించడం జరుగుతుందన్నారు.ఇప్పటి వరకు హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోనీ ఏడూ మండలాలో 184 గ్రామ పంచాయతీ లలోని 85,531 ఇండ్లలో సర్వే నిర్వహించగా అందులో 3,289 మందికి పాజిటివ్ గా గుర్తించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. వారిలో 2,486 మందికి మెడికల్ కిట్లు అందజేశామన్నారు.కోవిడ్ శత్రువుల నుండి రావడం లేదని అయిన వారి నుండి వ్యాపిస్తున్నదని అటువంటి వారు ఆత్మీయులకు దూరంగా ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలలో ఉండాలని ఆయన చెప్పారు. హుజుర్నగర్, కోదాడ లలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలు సరిపోక పోతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 200 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవచ్చని ఆయన చెప్పారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన 200 పడకల ఐసోలేషన్ కేంద్రంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి ఐసోలేషన్ కేంద్రాలలో వైద్య సేవలతో పాటు బోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్ పేషంట్ల కు అయ్యే ఖర్చు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి భరోసా ఇచ్చారని ఏ ఒక్కరూభయాందోళనకు గురి కావొద్దని ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం కపడుకుంటుందని మంత్రి జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *