లోకేష్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఘాటు వ్యాఖ్యలు……
పరీక్షలు అనేవి విద్యార్థుల భవిష్యత్తుకు సంభందించిన విషయం. ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని, దీనిని లోకేష్ ఎందుకు ఎంచుకున్నాడని మంత్రి సురేష్ అన్నారు.
మీకు అంశాలు కావాలంటే విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఎలా పాఠశాలలకు చేరుస్తారని అడగండి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇన్ని విద్యా పధకాలు ఎలా అమలు చేస్తున్నారని అడగండి. నాడు నేడు పనులు మొదటి విడత ముగిసాయి రెండో విడత ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించండి. అంతే కానీ పిల్లల భవిష్యత్తు ను కాలరాయాలనే ఉద్దేశం తో పరీక్షలు రద్దు చేయాలనే లోకేష్ ను ఏమనాలని మంత్రి అన్నారు.
విద్యార్థులు పరీక్షలు రాసి ప్రతిభావంతులు ఆయితే టీడీపీకి ఓట్లు వేయరు అని లోకేష్ భయం.
పరీక్షలు రాయకుండా అడ్డుకుంటే భవిష్యత్తు లో ఓట్లు వేస్తారు అనుకుంటున్నారేమో
అందరూ పరీక్షలు నిర్వహించాలని కోరుతుంటే రద్దు చేయాలని లోకేష్ కోరడం హాస్యాస్పదం
యువతకు లోకేష్ ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో తెలుసు
ఆయన పరీక్షలను రాజకీయం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ రాజకీయ విషయం కాదు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబందించిన అంశం.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిత్యం ఆలోచించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తల్లిదండ్రులు కూడా విశ్వశించారు.