09-06-2021 రాశి ఫలాలు

09-06-2021 రాశి ఫలాలు
Spread the love

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌

09, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
వైశాఖమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

శివ రామ గోవింద నారాయణ మహాదేవా

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్

రాశి ఫలాలు

🐐 మేషం
సకాలంలో పనులను పూర్తి చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.
శ్రీ రామ నామ జపం శ్రేయోదాయకం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
మధ్యమ ఫలితాలున్నాయి. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మానసికంగా ధైర్యంగా ఉండాలి.
దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. చేసేపనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయకండి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం శుభప్రదం
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
మంచి పనులు చేపడతారు. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. లింగాష్టకాన్ని పఠిస్తే బాగుంటుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. కొన్ని విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
,చిత్తశుద్ధితో చేసే పనులు మంచినిస్తాయి. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా చేయకూడదు. నవగ్రహ ధ్యానం శుభాన్నిస్తుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా నామాన్ని జపించడం ఉత్తమం
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి మిశ్రమ కాలం. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే అన్ని రకాలుగా మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు
మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదేవతా శ్లోకం చదవాలి.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: