రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో హుజురాబాద్ ఎన్నికల సన్నాహక సమావేశం.
తరుణ్ చుగ్, బండి సంజయ్, లక్ష్మణ్, అరవింద్, రాజసింగ్, రఘునందన రావు, స్వామిగౌడ్, వివేక్, పొంగులేటి, ప్రేమెందర్ రెడ్డి తో పాటు పలువురు బీజేపీ సీనియర్ నాయకులు, ఏనుగు రవీందర్పా రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి పాల్గొన్నారు.
హుజురాబాద్ ఎన్నికల బీజేపీ ఇంఛార్జిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నియామకం. మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే యెండలలక్ష్మీనారాయణ సహాయకులుగా నియామకం.
ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ..
2023 మంత్రి మండలి నాకు ఈ సమావేశ మందిరంలో కనిపిస్తుంది.
2023 లో కాబోయే ఎమ్మెల్యే లు ఇక్కడ కనిపిస్తున్నారు.
చరిత్ర నుండి మనం ఎప్పటికీ నేర్చుకోవాలి. రావణుడు లంక ను బంగారం తో కట్టినా, పెద్ద కట్టడాలు ఉన్నా రాముడు అనే సత్యం తో జరిగిన యుద్ధంలో అవినేల మట్టం అయ్యింది. అహంకారం అంతం అయ్యింది.
అలాగే ఇప్పుడు మన వైపు సత్యం ఉంది మనదే గెలుపు.
భారతీయ జనతా పార్టీ ఒక శక్తి. రాహుల్, మమతా లాంటి వాళ్లు ఓడిపోయారు.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక రాజేందర్ అయ్యి హుజురాబాద్ లో పని చేస్తాం.
రాజేందర్ కెసిఆర్ ముందు తలవంచితే మంత్రి గా కొనసాగేవారు. కానీ ఆత్మగౌరవం కోసం అన్నిటినీ వదిలి పెట్టారు. కెసిఆర్ అహంకారాన్ని మనందరం కలిసి అణిచివేసి తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెడదాం.
2023 ఎలక్షన్ కి హుజురాబాద్ ఒక ట్రయల్స్.
ఈటలరాజేందర్ గారు మాట్లాడుతూ..
50 రోజులుగా హుజురాబాద్ లో ఏంజరుగుతుందో మీ అందరికీ తెలుసు.
క్షేత్ర స్థాయిలో పని మొదలు పెడతాం.
కెసిఆర్ చేస్తున్న పనులు ప్రజాస్వామ్యానికి అరిష్టం.
హుజురాబాద్ ప్రజలను రక్షించుకుంట.
మీ అందరి సహాయసహకారాల తో గొప్ప మెజారిటీతో తిరిగి వస్తం.