రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త
Spread the love

ఆగస్టు నెల నుండి కొత్త కార్డుదారులకు 10కిలోల ఉచిత బియ్యం పంపిణి

నవంబర్ వరకూ కొనసాగనున్న 10కిలోల ఉచిత పంపిణి

53.56 లక్షల కార్డులకు కేంద్రం ఇచ్చే 5కిలోలకు అధనంగా రాష్ట్రం 5కిలోల ఉచిత బియ్యం సరఫరా

మిగతా 37లక్షల రాష్ట్ర కార్డులకు పూర్తిగా 10కిలోలు ఉచితంగా అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం

నెలకు కొత్తకార్డులకు 23.10 కోట్లతో కలిపి ఏడునెలల కాలానికి అదనంగా 416.34 కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం

కొత్తకార్డులకు కేటాయింపులు, ఆదనపు బియ్యం సేకరణ నేపథ్యంలో ఆగస్టు 3 నుండి పంపిణీ ప్రారంభం

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్దమయింది. ఆగస్టు మాసం నుండే వారికి రేషన్ అందించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన విడుదల చేసారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా రాష్ట్రoలో అర్హులైన సుమారు 3,09,083 కొత్త కార్డుల్లోని, 8.65 లక్షల లబ్దీదారులకు ఆగష్టు నుండి ఒక్కొక్కరికి 10 కిలొల బియ్యం చొప్పున ఆగస్టు నుండి నవంబర్ నాలుగు నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందించనున్నామన్నారు. ఇందుకై అదనంగా నెలకు రూ.23.10 కోట్లతో 4 నెలలకు రూ.92.40 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుoదన్నారు మంత్రి గంగుల.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన PMGKAY పథకం క్రింద ఒక్కోక్కరికి 5 కిలోల చొప్పున రాష్ట్రంలోని 53.56 లక్షల NFSA కార్డుదారులకు, 33.85 లక్షల రాష్ట్ర కార్డుదారులకు గత మే,జూన్ రెండు నెలలుగా ఉచిత రేషన్ అందించిన విషయం తెలిసిందే. జూలైకు సంబందించిన పంపిణీ ఏర్పాట్లు ముగిసిన తర్వాత 24.6.2021 నాడు కేంద్రం నుండి ఉచిత రేషన్ పొడిగింపుపై అధికారిక సమాచారం అందడంతో జూలైలో ఇవ్వవలిసిన 5కిలోల ఉచిత బియ్యాన్ని ఆగష్టు, 2021 కోటా 10 కిలోలకు కలిపి అదనంగా మొత్తం 15 కిలోలు పంపిణి చేయడం జరుగుతుందన్నారు. ఇందుకుగాను 87.41 లక్షల పాత కార్డుల్లోని దాదాపు 2.80 కోట్ల లబ్దీదారులకు 7 నెలలకోసం రూ.323.94 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు మంత్రి.


దీంతో రాష్ట్రంలోని మొత్తం 90.50 లక్షల కార్డుల్లోని 2.88 కోట్ల లబ్దీదారులకు ఉచిత బియ్యం పంపిణికి గాను రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.416.34 కోట్లు అదనంగా ఖర్చు చేయనుందన్నారు. క్రొత్త కార్డుల జారి, అదనపు బియ్యాన్ని చౌకధరల దుకాణాలకు తరలిoచవలసి వున్నందున ఆగష్టు నెల పంపిణి 3వ తేది నుండి ప్రారంబిస్తామని తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్.

tanvitechs

tanvitechs

One thought on “రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *