ఇంద్రవెళ్లి దండోరాకు కాంగ్రెస్ భారీ సన్నాహాలు..

Spread the love

ఇంద్రవెళ్లి దండోరాకు కాంగ్రెస్ భారీ సన్నాహాలు..

18 నియోజక వర్గాలలో కాంగ్రెస్ సమన్వయ కమిటీలు..

ఎమ్యెల్యే జగ్గారెడ్డి బాధ్యతలు

కాంగ్రెస్ లో భారీగా చేరికలు.. నిన్న సర్పంచులు, ఎంపిటిసిలు, విద్యార్థి, యువ నాయకుల చేరిక..

ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ ఎంపీపీ, సర్పంచులు, ఎంపిటిసి లు చేరికతో కాంగ్రెస్ లో నోతనోత్తేజం..

ఆగస్టు 9న క్విట్ ఇండియా దినోత్సవం, అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్బంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చారిత్రక ఇంద్రవెళ్లి వద్ద నిర్వహిస్తున్న దళిత, గిరిజన.ఆత్మ గౌరవ దండోరా సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున సన్నాహాలు చేపట్టింది.

ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావ్ క్షేత్ర స్థాయిలో పనులను ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే సీతక్క సభ స్థలాన్ని.పరిశీలించడమే కాకుండా గ్రామలాల్లో పర్యటించారు.

అలాగే టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సభను విజయవంతం చేసేందుకు పార్టీ తరపున సమన్వయ బాధ్యతలు తీసుకొని పనులు చేపట్టారు.

ఇంద్రవెళ్లి సమీపంలో ఉన్న 18 నియోజక వర్గాలకు పార్టీ ముఖ్య నాయకులతోపాటు అనుబంధ సంఘాల నాయకులతో కమిటీలు వేసి సభ విజయవంతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.

కొమురం భీం మనవడు సోనిరావ్ ఇటీవల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ లో కలిసి తన సంఘీభావం ప్రకటించారు.

ఇంద్రవెళ్లి చుట్టుపక్కల ఉన్న ఆదిలాబాద్, ఖానాపూర్ తదితర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున టిఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చింది.

బుధవారం నాడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో ఖానాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సయ్య, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బజ్జు, మండల వైస్ ఎంపీపీ శ్యామ్ సుందర్ లతో పాటు పదుల సంఖ్యలో టిఆర్ఎస్ సర్పంచులు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు కాంగ్రెస్ లో చేరారు.

అలాగే ఇంద్రవెళ్లి సభ, దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాలపై బుధవారం నాడు టీపీసీసీ అధ్యక్షులు ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు.

ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దాదాపు 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దండోరా కార్యక్రమాలు చెపదుతున్నట్టు పార్టీ ఇప్పటికే ప్రకటీచింది. అందుకు తగిన ఏర్పాట్లలో కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచనలో ఉంది.

సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ తెలంగాణలో ఒక రోజంతా ఈ కార్యక్రమాలలో పాల్గొంటారని పార్టీ ప్రకటించడంతో కార్యకర్తలలో జోష్ పెరిగింది.

ఈ విదంగా ఇంద్రవెళ్లి సభ తో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి లో పార్టీ మరింత బలపడేందుకు ప్రణాళిక బద్దంగా వెళ్తుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *