బీజేపీ అధికారంలోకి రాగానే….
భాగ్యలక్ష్మీ, బైంసా, ఉట్కూర్ గ్రామాలను దత్తత తీసుకుంటా
-పోలీసుల దాడిలో గాయపడ్డ తమ్ముళ్లకు ఉద్యోగాలిప్పిస్తా
-ఉట్కూర్, బైంసాలో హిందువులను చిత్రహింసలు పెట్టిన పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటాం
-హిందూ రాజ్యాన్ని స్థాపించడమే నా ధ్యేయం
-69 జీవోను అమలు చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం
-ఈనెల 5న జేపీ నడ్డా, 14న అమిత్ షా రాష్ట్రానికి రాక
ఉట్కూర్ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీ భాగ్యలక్ష్మీ దేవాలయ, బైంసా, ఊట్కూర్ ప్రాంతాలను దత్తత తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఉట్కూరులో పోలీసుల చిత్రహింసలకు గురై అనేక కేసులతో ఇబ్బంది పడుతున్న యువకులను ఆదుకోవడంతోపాటు వారికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ఉట్కూర్, బైంసాలో హిందువులను చిత్రహింసలు పెట్టిన పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్త లేదని, వారు ఎక్కడున్నా రప్పించి ప్రజాస్వామ్య, చట్ట బద్దంగా ప్రతీకార చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 69 జీవోను అమలు చేసి ఉట్కూర్ సహా మక్తల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. హిందూ రాజ్యం స్థాపించడమే తమ ధ్యేయమని పునరుద్ఘాటించారు. 14వ రోజు పాదయాత్రలో భాగంగా మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎడవెల్లి గేట్ వద్ద బీజేపీ జెండా ఆవిష్కరించారు. బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పిల్లలు, యువకులు, పెద్దలు, మహిళలు అనే తేడా లేకుండా భారీ ఎత్తున తరలివచ్చారు. పెద్ద ఎత్తున ఎండ్ల బండ్లతో సంజయ్ కు స్వాగతం పలికారు. మోటార్ బైక్ ర్యాలీలతో పార్టీ జెండాలు చేతపట్టి బండి సంజయ్ వెంట సాగారు. పాదయాత్ర ఊట్కూర్ చేరుకోగానే బండి సంజయ్ ఉట్కూర్ నేలను ముద్దాడారు. మట్టిని తిలకంగా దిద్దుకున్నారు. అనంతరం ఉట్కూర్ కు తరలివచ్చిన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….
• టీఆర్ఎసోళ్లు నా చావు కోరుకుంటున్నరు. గుండెపోటు వస్తే కార్యకర్తలు పూజలు చేసిండ్రు. అమ్మవారి ఆశీస్సులతో పైదాకా పోయొచ్చిన. బండి సంజయ్ ను చూసి చావే భయపడుతుంది. హిందూ ధర్మం ఎవరి చావునూ కోరుకోదు. బండి సంజయ్ హిందువని గర్వంగా చెప్పుకుంటడు.
• ఊట్కూరులో బీజేపీ కార్యకర్తలు తెగించి కొట్లాడుతున్నరు. గూండాల చేతిలో దెబ్బలు తిన్నా.. కళ్లు, కాల్లు కోల్పోయినా వెరవకుండా యుద్దం చేస్తున్నారు. వాళ్లందరికీ నా సెల్యూట్ చేస్తున్నా.
• 69 జీవోను అమలు చేస్తే మొట్టమొదట నిండేది ఉట్కూరు చెరువే. దీంతో 15 గ్రామాలకు సాగు నీళ్లందుతాయి. బీజేపీ అధికారంలోకి రాగానే 69 జీవోను అమలు చేసి తీరుతాం. ప్రాజెక్టుల నిర్మాణం చేపడతాం. ఈ చుట్టు పక్కల గ్రామాలను సస్యశ్యామలం చేస్తాం. పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తాం.
• సీఎం కేసీఆర్… నేను మతతత్వాన్ని రెచ్చగొడుతున్ననట. నేనింకా పూర్తిగా మాట్లాడలేదు. ఉట్కూర్ ప్రజలు హీరోలు.. ఉట్కూర్ యువకుల చరిత్ర విన్న తరువాత చలించిపోయిన. ఉట్కూర్ వీర యోధులు… అంబేద్కర్ వారసులు. సావర్కర్ వారసులు… పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా, జైళ్లో పెట్టినా భయపడకుండా వీరోచితంగా పోరాడుతున్నరు.
• ఏం తప్పు చేశారన్నా ఊట్కూర్ ప్రజలు… తెలంగాణ సమాజమంతా ఉట్కూర్ హిందువులకు జరిగిన అన్యాయాన్ని వినాలే. సెప్టెంబర్ 3ను బ్లాక్ డే గా ప్రకటిస్తున్నా. అధికారంలోకి వచ్చాక విజయోత్సవ సభలు నిర్వహిస్తారు.
• నిజాం కాలంలో రజాకార్లు చేసిన అరాచకాలు తెలుసు… కానీ కేసీఆర్ పాలనలో పోలీసులు ఉట్కూర్ హిందువులను, మహిళలను రాచిరంపాన పెట్టారు. చిత్రహింసలు పెట్టారు. గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా?
• ఉట్కూర్ గ్రామంమీద పడి నా హిందువులను రాచిరంపాన పెట్టిన పోలీసులను వదిలిపెట్టను. మీరు రిటైర్డ్ అయినా, విదేశాలకు పోయినా పక్కా గుంజుకొస్తా. ఒకే గ్రామంలోని 30 మంది రౌడీషీట్, 40 మంది కమ్యూనల్ షీట్ ఓపెన్ చేసి జైల్లో పెట్టారు. ఒక్కో వ్యక్తిపై గంటలోపే 23 కేసులు బనాయించారు. హిందువుల ఇండ్లల్లోకి చొరబడి కొట్టారు. వాళ్ల భయానికి దాచుకున్నాం. బయటకు వెళ్లలేక కవర్లలోనే మల, మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి కల్పించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై కేసులున్నాయి. ఎంతమంది కేసులున్నాయి? (చాలా మంది చేతులెత్తి తమపై కేసులున్నాయని అన్నారు)
• ఇద్దరు ఎస్పీలు వెయ్యి మంది పోలీసులు ఉట్కూర్ లో దిగి ఒక్కో ఇంటికి 5 గురు పోలీసులొచ్చి హిందువుల ఇండ్లలోకి జొరబడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. రౌడీషీట్, కమ్యూనల్ షీట్ ఓపెన్ చేసి జైళ్లకు పంపారు.
• టీఆర్ఎస్ నేతలారా… మీది హిందువు పుట్టక పుట్టలేదా?… అకారణంగా చిత్రహింసలు పెట్టి రౌడీ షీట్ పెట్టి జైళ్లకు పంపుతారా… థూ.. మీ బతుకు చెడ.. బైంసాలోనూ ఇదే దుస్థితి. మసీదుపై 4 రాళ్లు వేశారని 4 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం… హిందువుల ఇండ్లపై ఎంఐఎం గూండాలు దాడులు చేసి 21 ఇండ్లను తగలబెడితే నయాపైసా సాయం చేయలే. హిందువుల బైక్ లను తగలపెట్టారు. హిందువులు చేసుకున్న పిండి వంటల (సకినాలు)పై మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. అయినా పోలీసులు పట్టించుకోకుండా హిందువులపై తిరిగి దాడులు చేశారు. చాలా మంది పోలీసుల బాధలు తాళలేక కోమాలోకి వెళ్లారు.
• బీహార్ లో 10 శాతం ముస్లిం ఓట్లుంటే ఎంఐఎం 5 సీట్లు గెలిచింది. 80 శాతమున్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే గొల్లకొండపై కాషాయ జెండా ఎగరుతుంది. తప్పకుండా హిందూ రాజ్యంగా మారుస్తాం.
• హిందువులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను బీజేపీ మరిచిపోయే ప్రసక్తే లేదు. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇలాంటి గూండాలపైనా, వారికి మద్దతిస్తున్న పోలీసులను దోషిగా నిలబెడతాం. ప్రజాస్వామ్య, చట్టబద్ధంగా శిక్షించి తీరుతాం.
• ఉట్కూర్ ప్రజలారా… మీరంతా తెలంగాణ అంతటా తిరగండి.. హిందువులకు జరిగిన అన్యాయాన్ని వివరించి అందరినీ ఏకం చేయండి. బీజేపీ అధికారంలోకి వచ్చాక పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం, బైంసా, ఉట్కూర్ ప్రాంతాలను నేను దత్తత తీసుకుంటా. గాయపడ్డ తమ్ముళ్లకు ఉద్యోగాలిప్పించే బాధ్యత తీసుకుంటా. తెలంగాణ చరిత్రలో ఉట్కూర్, బైంసా తమ్ముళ్ల వీరోచిత పోరాటాలు నిలిచిపోయేలా చేస్తాం.
• ఈ ఊట్కూర్ వేదికగా చెబుతున్నా… పోలీసులారా.. ఇక్కడి హిందువులను వేధించొద్దని కోరుతున్నా. ఇకపై ఒక్క లాఠీదెబ్బ పడినా నేనే స్వయంగా ఉట్కూర్ వస్తా.. వాళ్ల సంగతి చూస్తా… ఉట్కూర్ అభివ్రుద్ది కోసం నా ఎంపీ లాడ్స్స్ నుండి రూ. 5 లక్షలు ప్రకటిస్తున్నా. అట్లాగే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సైతం ఎంపీ లాడ్స్ నుండి మరో రూ.5 లక్షలు ప్రకటించారు. ఇది ఉడతా సాయం మాత్రమే. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉట్కూర్ ను అద్దంలా మెరిపించేలా అభివ్రుద్ది చేసి తీరుతాం.
• ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈనెల 5న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, 14న హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. పాదయాత్రలో పాల్గొని సభలో మాట్లాడతారు.
• ఈరోజు తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పెట్టిన భిక్షే. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న కేసీఆర్ కొడుకు మంత్రి అయ్యాడంటే రాజ్యంగం పెట్టిన భిక్ష. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ఘనుడు. ఏ ఒక్క సామాజికవర్గ సమస్యలు పరిష్కరించని దుర్మార్గుడు. ఒక్క యువకుడికి ఉద్యోగం ఇవ్వని కేసీఆర్ ఆయన కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలిచ్చి నెలకు రూ.25 లక్షల జీతం తీసుకుంటున్నరు.
• వందలాది పేదల బలిదానాలతోనే తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. గరీబోళ్లు అల్లాడుతున్నరు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రేషన్ బియ్యం సహా గ్రామాల్లో అమలవుతున్న అభివ్రుద్ధి పథకాలన్నీ కేంద్రం ఇస్తున్న నిధులతో చేపడుతున్నవే.
• బీజేపీ ఈ విషయాలన్నీ వివరిస్తూ ప్రజలను చైతన్యం తీసుకొస్తుంటే… కేసీఆర్ భయపడుతున్నారు. బీజేపీని ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్, ఎంఐఎంతో కేసీఆర్ కుమ్కక్కైండు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ గుంట నక్కల పార్టీలు.. మా నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ సింహంలా సింగిల్ గానే పోటీ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం. గరీబోళ్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం.
జోగినీ వ్యవస్థపై పోరాడుతున్న ఆజమ్మ మాట్లాడుతూ…
• ఈ ప్రాంతంలో ఇంకా జోగినీ వ్యవస్థ కొనసాగుతోంది. సామాజిక న్యాయం జరగడం లేదు. జోగినీ వ్యవస్థ రద్దుకు మద్దతివ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేస్తున్నా.
నాగూరావు నామోజీ మాట్లాడుతూ… నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ఉట్కూర్ ప్రజలను ఆదుకుంటా. నరేంద్ర మోదీ స్కీంలను ఇంటింటికీ తీసుకుపోయి టీఆర్ఎస్ ను బొందపెట్టాలి. బండి సంజయ్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరుతున్నా…
శాంతికుమార్ మాట్లాడుతూ…ఇక సమరమే. ప్రత్యర్థులు బేజారే… బండి జెండా ఖరారే. ఆరోగ్యం సహకరించకున్నా మీ అందరి జోష్ ను చూసి సంజయ్ ఛత్రపతి శివాజీలా పాదయాత్ర చేస్తున్నారు.
• ఈ సభకు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఇంఛార్జీ నాగూరావు నామోజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి, కొండయ్య, పాదయాత్ర సహ ప్రముఖ్ లు టి.వీరేందర్ గౌడ్, కుమ్మరి శంకర్, యువ మోర్చా నాయకులు శ్యాంరాజ్, భరత్, జడ్పీటీసీ హన్మం