విధ్వంసం చేయించినవారంతా వైసీపీముఖ్యకార్యకర్తలే!

విధ్వంసం చేయించినవారంతా వైసీపీముఖ్యకార్యకర్తలే!
Spread the love

టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడి గారి స్క్రోలింగ్ పాయింట్స్ : 25.05.2022.

• అమలాపురంలో జరిగిన విధ్వంసం ప్రభుత్వసహాయ, సహాకారాలతో పథకంప్రకారం జరిగిందే.
• విధ్వంసం చేయించినవారంతా వైసీపీముఖ్యకార్యకర్తలే.
• కోనసీమవిధ్వంసంలో కీలకపాత్రధారి అయిన అన్నంసతీశ్ ఏపార్టీవాడు?
• అతను టీడీపీ వాడయితే సజ్జల రామకృష్ణారెడ్డిని కౌగిలించుకొని, మంత్రి విశ్వరూప్ కు సన్మానంచేస్తాడా?
• విధ్వంసాలు, వినాశనాలు వైఎస్సార్ కుటుంబానికి పుట్టుకతోనే వచ్చిన విద్య.
• ముఖ్యమంత్రి పదవికోసం రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో మతకలహాలు సృష్టించి, 200మంది చావుకు కారకులయ్యారు.
• తండ్రి చనిపోయాక ముఖ్యమంత్రి పదవికోసం రిలయన్స్ సంస్థలపై జగన్ రెడ్డి దాడులు చేయించలేదా?
• కాపు ఉద్యమం ముసుగులో తునిలో రైలుతగలబెట్టించింది జగన్మోహన్ రెడ్డికాదా?
• ముఖ్యమంత్రి పదవికోసం సొంతబాబాయ్ ని చంపించింది ఈ వ్యక్తికాదా?
• ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారీ ఏదోఒకటి సృష్టించడం జగన్ కు బాగాతెలుసు.
• సొంతపార్టీ ఎమ్మెల్సీ దళితయువకుడిని చంపినఘటన రాష్ట్రంలో సంచలనమైంది.
• సుబ్రహ్మణ్యం హత్యనుంచి ప్రజలదృష్టిమళ్లించడానికే కోనసీమలో జగన్ చిచ్చుపెట్టించాడు.
• చంద్రబాబుకి ప్రజాదరణ పెరగడం, తెలుగుదేశంమహానాడు జరుగుతుండటంతో అమలాపురంలో విధ్వంసానికి కుట్రలేపారు.
• డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్ రెడ్డిదిట్టని అందరికీ తెలుసు.
• ఆప్రాంతంలో ఉద్యమం జరుగుతుందని తెలిసీ, దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
• అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కనీసం పూర్తిస్థాయి సీఐనికూడా నియమించకపోవడానికి కారణమేంటి?
• 144సెక్షన్ విధించినా పట్టణంలోకి ఒకేసారి అంతమంది ఎలా వచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి.
• లా అండ్ ఆర్డర్ లో జగన్ ప్రభుత్వం విఫలమైంది అనడానికి మంత్రి ఇల్లు తగలబడటమే నిదర్శనం.
• మంత్రి, మరోఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇళ్లకు పోలీసులు ఎందుకు పూర్తిస్థాయి భద్రతకల్పించలేదు?
• ఇళ్లు తగలబడుతుంటే ఫైర్ ఇంజన్లు ఎందుకు రాలేదు?
• అమలాపురం విధ్వంసం టీడీపీనే చేయించిందని పిచ్చివాళ్లలా మంత్రులు, ప్రభుత్వసలహాదారులు మాట్లాడుతున్నారు.
• జిల్లాల విభజనలో ముఖ్యమంత్రి ఏనాడైనా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతోసంప్రదించాడా?
• కులాలు, మతాలు, ప్రాంతాలమధ్యచిచ్చుపెట్టి పబ్బంగడుపుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి ఆటలుసాగనివ్వం.
• కోనసీమ అల్లర్లపై ముఖ్యమంత్రి నుంచీ కనీసస్పందన లేకపోవడం దురదృష్టకరం.
• ప్రభుత్వకుట్రలు, కుతంత్రాలకు ప్రజలెవరూ ఆందోళనచెందాల్సిన పనిలేదు. సంయమనంతో వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *