“సామాజిక న్యాయ భేరి – జయహో జగనన్న” – ఆడియో, వీడియో విడుదల

Spread the love

“సామాజిక న్యాయ భేరి – జయహో జగనన్న” – ఆడియో, వీడియో విడుదల

  • రేపటి నుంచి సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర
  • స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం
  • సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు.. అది మా విధానం

“సామాజిక న్యాయ భేరి – జయహో జగనన్న” పేరుతో రూపొందించిన ఆడియో, వీడియోలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏమన్నారంటే…

రేపటి నుంచి సామాజిక న్యాయ భేరి మోగిస్తున్నాం..
రేపటి నుంచి రాష్ట్రమంతా సామాజిక న్యాయ భేరిని మోగిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి నేతృత్వంలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరిస్తూ.. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను చేపట్టాం. రాష్ట్రంలోని బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అటు ప్రభుత్వంలోనూ, ఇటు స్థానిక సంస్థల నుంచి రాజ్యసభ వరకు రాజకీయ పదవులు, వివిధ కార్పొరేషన్ పదవుల్లో సముచిత స్థానం ఇవ్వడం, మా ప్రభుత్వంలో ఆ వర్గాలకు ఏవిధంగా న్యాయం కల్పించామనే అంశాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టాం.

  • గత ప్రభుత్వాల హయాంలో, కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే ఈ వర్గాలకు పదవులు ఇచ్చారని గొప్పగా చెప్పుకునే నేపథ్యం చూశాం. ఇవాళ జగన్‌గారి నాయకత్వంలో కేబినెట్‌లో 25మంది మంత్రులు ఉంటే, అందులో 17మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి స్థానం కల్పించారు. అలాగే ఎన్నికల ముందు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీ ప్రకారం 50శాతం కంటే ఎక్కువగా నామినేటెడ్‌ పదవులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లుగా అవకాశం కల్పించాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం ద్వారా సముచిత స్థానం కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటాం.

సామాజిక న్యాయం నినాదం కాదు.. మా విధానం..
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి, మాకు అధికారం కావాలి, అధికారం ఉంటే మా వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ వర్గాలు కూడా మిగిలిన వర్గాలకు పోటీగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా బలపడాలని కోరుకుంటున్నాయి. సామాజిక న్యాయం అన్నది గత ప్రభుత్వాల హయాంలో కేవలం మాటలకే పరిమితం. మాటలతో కాకుండా చేతలలో చేసి చూపించారు మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారు. సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు.. మా ప్రభుత్వ విధానం అని గర్వంగా చెప్పగలం.

  • బలహీన వర్గాలు సగర్వంగా తలెత్తుకునేలా మా సామాజిక వర్గాలకు ఏవిధంగా సంక్షేమం అందిందో, అభివృద్ధి జరిగిందో చాటి చెప్పడానికే రేపటి నుంచి (గురువారం) శ్రీకాకుళంలో మొదలుపెడుతున్న సామాజిక న్యాయభేరి ప్రధాన ఉద్దేశం. శ్రీకాకుళంలో ప్రారంభమై అనంతపురంలో ఈ యాత్ర ముగుస్తుంది. 26న విజయనగరం, 27న రాజమండ్రిలో, 28న నరసరావుపేటలో, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తాం. ఈ బస్సు యాత్రలో క్యాబినెట్‌లో ఉన్న 17మంది మంత్రులే కాకుండా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఆయా ప్రాంతాల చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్నవారంతా పాల్గొంటారు. బడుగు, బలహీనవర్గాలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. బడుగు, బలహీన వర్గాలకు జరిగిన మేలుపై వీడియో రూపంలో కూడా కార్యక్రమాన్ని రూపొందించాం.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు శ్రీ నారాయణ స్వామి, శ్రీ అంజాద్ భాషా, శ్రీ మేరుగ నాగార్జున, బీసీ మంత్రులు శ్రీ జోగి రమేష్, శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

YSRCP #SamajikaNyayaBheri #AP #Amalapuram #Janasena #PawanKalyan #CBN #Telugudesam


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *