Breaking News: తానేటి వనిత – హోం శాఖ మాత్యులు…

Share this news

బ్రేకింగ్ పాయింట్స్…

తానేటి వనిత – హోం శాఖ మాత్యులు…

అమలాపురం సంఘటనపై డీజీపీ గారితో సమీక్షించడం జరిగింది.

ఆందోళనలు జరగకుండా అడిషనల్ డీజీ, డీఐజి, ఎస్పీ లను, అదనపు బలగాలను పంపించాము.

అమలాపురంలో ఆందోళన పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు

ప్రజలెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరూ ధైర్యంగా ఉండొచ్చు.

హింసకు పాల్పడిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గతంలో 7 కు పైగా కేసులు ఉన్న వారిని 72 మందిని పోలీసులు గుర్తించారు. వీరిలో 46 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది.

శాసన సభ్యులు, మంత్రి గారి ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసులపై కూడా దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను.

ఆందోళనకారులు దాడి చేస్తున్నప్పటికీ ఎదురుదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారు.

అమలాపురం ఘటనలో ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు, ఆందోళనకారులు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

పోలీసులు తాము గాయపడినప్పటికి ప్రజలకు రక్షణగా ఉంటూ.. ఆందోళనకారులను అదుపుచేశారు.

నిన్న పోలీసులు వ్యవరించిన తీరే ఫ్రెండ్లీ పోలీసింగ్ కు నిదర్శనం. పోలీసులను అభినందిస్తున్నాను.

సోషల్ మీడియా ద్వారా రూమర్స్ వెళ్ళకుండా అమలాపురం లో ఇంటర్నెట్ నిలిపివేశాము.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి అప్రమత్తంగా వున్నారు.

ప్రజలెవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

JanasenaParty #PawanKalyan #Amalapuram #Konaseema #YSRCP #TDP #Chandrababu


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *