ఇప్పట్లో తిరుమల రావద్దు… మూడు రోజులపాటు బ్రేక్ దర్శనాలు రద్దు… TTD Addl EO ధర్మారెడ్డి.
తిరుమలలో భక్తజన సందోహం
- శ్రీవారి దర్శనానికి దాదాపు 48 గంటలు
- ఈ మేరకు భక్తులు తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలి : టిటిడి తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది.
శ్రీవారి ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేయడమైనది. ఇటువంటి అనూహ్యమైన రద్దీ సమయంలో విఐపిలు కూడా తిరుమల యాత్ర విషయం పునరాలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని టిటిడి కోరుతోంది.
భక్తుల క్యూలైన్ల తనిఖీ
టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శనివారం సాయంత్రం తిరుమలలో భక్తులు వేచి ఉన్న క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నామని ఈఓ తెలిపారు. పోలీసులు, విజిలెన్స్, టిటిడిలోని అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలియజేశారు.
ఈఓ వెంట అన్ని విభాగాల అధికారులు ఉన్నారు.
ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 48గం ల సమయం పడుతోందని.. రానున్న నాలుగైదు రోజుల్లో రద్దీ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందికావున భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోచాలని ధర్మారెడ్డి సూచించారు… తిరుమలలో రద్దీదృష్ట్యా మూడు రోజులపాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని సిఫారసు లేఖలతో వచ్చేవారు గమనించాలని ధర్మారెడ్డి సూచించారు.