తెలంగాణ ఆసరా పెన్షన్ ఆర్డర్స్ & కార్డ్స్ పంపిణీ

Spread the love

నూతన ఆసరా పెన్షన్ ఆర్డర్స్ & కార్డ్స్ పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ద, వికలాంగుల, వితంతువులకు విజయవంతంగా అందిస్తున్న ఆసరా పెన్షన్లు 65 ఏళ్ల నుండి 57 ఏళ్లకు తగ్గించి మరింత మందికి అవకాశం కల్పించింది.

ఈ మేరకు రాష్ట్రంలో కొత్త‌గా 10 ల‌క్ష‌ల ఆస‌రా పెన్ష‌న్లు సీఎం కేసిఆర్ మంజూరు చేసిన దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతంగా మంజూరైన ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు కొత్తగూడెం క్లబ్ నందు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.

May be an image of 10 people and people standing

మంత్రి పువ్వాడ మాట్లడుతూ.. ఆసరా పింఛన్ల అర్హతకు వయో పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి పువ్వాడ హర్షం వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 48 వేల మందికి వివిధ పెన్షన్లు ఇస్తుండగా 28,427 మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయని, సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికీ విస్తరించాలని చిత్తశుద్దితో కేసీఅర్ గారి లాగా ముందు చూపుతో పాలన చేస్తే క్షేత్ర స్థాయిలో సంక్షేమం అందుతుంది అని అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు లక్షలు ఉండగా ఇపుడు 78వేలు దాదాపు మొత్తంగా 2.78 లక్షల పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుందన్నారు.

సకల జనుల సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కోటి ఐదు లక్షల కుటుంబాలు ఉండగా అందులో 46లక్షల మంది కుటుంబాలకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.

ఉచితాలు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఇక్కడి నుండి పారిపోయిన దొంగలను పట్టుకోవల్సింది పోయి రైతులు, పేదల పై మీ విషం ఏంటని ధ్వజమెత్తారు..

మేము ఇస్తున్న సంక్షేమ పథకాల్లో మీ వాటా లేదు… మీ ప్రమేయం లేదు అని స్పష్టం చేశారు.

కుటుంబానికి తల్లిదండ్రులు ఎలా పెద్ద దిక్కు లా ఉండి కుటుంబాన్ని నడిపిస్తారో అదే తరహాలో రాష్ట్ర ప్రజలకు, పేదలకు ముఖ్యమంత్రి కేసీఅర్ గారు పెద్ద దిక్కుగా ఉండి వారి అభివృధ్ధి, సంక్షేమం ను క్రమం తప్పకుండా ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగి జీతం లాగా ఆసరా పెన్షన్ లు వారి బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారని గుర్తు చేశారు.

మన సంక్షేమం పట్ల పూర్తి బాధ్యత తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి మనం ఎల్లపుడూ రుణపడి ఉండాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ కేవలం మత విద్వేషాలు రేచ్చగొడుతు.. మతాల వారీగా విడదీస్తూ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి సామాన్యుడి ఉన్నతమైన విద్యతో పాటు వైద్య విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతోనే కొత్తగూడెం కు వైద్య కళాశాల ను మంజూరు చేయడం జరిగిందన్నారు. అతి త్వరలో వైద్య కళాశాల, నూతన కలెక్టరేట్ భవనం ముఖ్యమంత్రి కేసీఅర్ గారి చేతుల మీదగా ప్రారంభోత్సవం చేసుకుందామని అన్నారు.

కలెక్టర్ అనుదదీప్ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారు, ఎమ్మేల్యేలు మెచ్చా నాగేశ్వర రావు గారు, ZP చైర్మన్ కోరం కనకయ్య గారు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం గారు, మున్సిపల్ చైర్మన్ కాపు సీతామాలక్ష్మీ గారు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ గారు, అధికారులు ఉన్నారు.

Website Link for Asara Pension Status Check:

https://tanvitechs.com/2021/08/19/how-to-check-aasara-pension-status-in-telangana/


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *