గుంటూరు
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్స్.
రాష్ట్రంలో50లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఇసుక కొరతతో కార్మికులు ఉపాధిలేక రోడ్డునపడ్డారు.
భవన నిర్మాణరంగం కార్మికులందరూ ఈ-శ్రామ్ లో నమోదు చేయించుకోండి.
భవన నిర్మాణరంగం కార్మికుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో బంగారం ఈజీగా దొరుకుతుంది… ఇసుక దొరకడం లేదు.
గతంలో కొంతమంది నాటుసారా తయారుచేసేవారు… సీఎం జగన్ పచ్చి బ్రాందీ తయారుచేస్తున్నారు.
రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, రైస్, లిక్కర్, మైనింగ్ మాఫియాలు తయారయ్యాయి.
రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు.
మేం అధికారంలోకి వస్తే వారం రోజులలో గిట్టుబాటు ధర కల్పిస్తాం.
పాలనపై ప్రభుత్వానికి అవగాహన లేదు.
ప్రతి జిల్లాలో సివిల్ సప్లైస్ అధికారులు, ప్రజాప్రతినిధులు వందకోట్ల అవినీతికి పాల్పడుతున్నారు.
రాష్ట్రాన్ని పదిలక్షల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం.
నాడు-నేడు కింద 50వేలకోట్లు రాష్ట్రానికి ఇచ్చాం.
కేంద్రపథకాలు క్షేత్రస్థాయికి వెళ్లనివ్వడంలేదు.
రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వానికి 6వేల 500 కోట్లు ఇచ్చాం.
ఆ నిధులను ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి.
మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారు.
వైసీపీ, టీడీపీ కుటుంబ పార్టీలు.
కుటుంబ పార్టీలు అవినీతి చేస్తాయి, ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తారు