తిరుపతి బ్రహ్మోత్సవాలకు ఒలెక్ట్రా బస్సులు
•ఎపీఎస్ఆర్టీసికి 10 విద్యుత్ బస్సుల డెలివరీ
• తిరుపతి – తిరుమల ఘాట్ రోడ్డులో కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులు
• ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ బస్సులను అందించిన మొదటి కంపెనీ ఒలెక్ట్రా
• త్వరలో దక్షిణాంధ్ర జిల్లాలు – నెల్లూరు, కడప, మదనపల్లె లకు ఈ కాలుష్యరహిత శబ్దం రాని బస్సులు
హైదరాబాద్, సెప్టెంబర్ 27:
భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్రగామి, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓలెక్ట్రా), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టిసి)కు 10 అత్యాధునిక విద్యుత్ బస్సులను డెలివరీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు విద్యుత్ బస్సులను అలిపిరి డిపోలో జెండా ఊపి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
గత ఏడాది నవంబర్ లో, ఒలెక్ట్రా, ఈవీ ట్రాన్స్ ల కన్సార్షియంకు ఎపీఎస్ఆర్టీసీ నుంచి విద్యుత్‌తో నడిచే 100 బస్సులు సరఫరా చేయడానికి ఆర్డర్‌ను లభించింది. ఈ 100 ఈ-బస్సులు 12 సంవత్సరాల పాటు స్థూల కాస్ట్ కాంట్రాక్ట్ (GCC)/OPEX మోడల్ ప్రాతిపదికన సరఫరా చేయడంతో పాటు నిర్వహిస్తాయి. మిగిలిన 90 విద్యుత్ బస్సులను అతి త్వరలో ఒలెక్ట్రా డెలివరీ చేయనుంది. ఈ బస్సులను అలిపిరి (తిరుపతి)లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ బస్సుల డిపో నుంచి నిర్వహిస్తారు. 50 బస్సులు తిరుమల-తిరుపతి ఘాట్‌లో నడపనుండగా, మిగిలిన 50 బస్సులు నెల్లూరు, కడప, మదనపల్లెలకు ఇంటర్సిటీ బస్సులుగా నడుస్తాయి. కాంట్రాక్టు కాలంలో ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ బస్సుల నిర్వహణను కూడా చేపడుతుంది.
ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కే వీ ప్రదీప్ మాట్లాడుతూ, “బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు సేవ చేయడం మాకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నాం. తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో మా అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. శేషాచల అడవులతో పాటు తిరుమల కొండల పర్యావరణాన్ని ఈ బస్సులు కాపాడతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సేవలందించేందుకు ఓలెక్ట్రా బస్సులను నడపడం గర్వంగా భావిస్తున్నాం. సమర్థవంతమైన ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా కాలుష్య స్థాయిలను తగ్గించే ప్రయత్నాలకు ఒలెక్ట్రా కట్టుబడి ఉంది. మా 100 విద్యుత్ బస్సులు మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవంతమవుతాయని మేము భావిస్తున్నం. మా విద్యుత్ బస్సులు ముంబై, పూణే, నాగ్‌పూర్, హైదరాబాద్, సూరత్, డెహ్రాడూన్, సిల్వాసా, గోవా, హిమాచల్ ప్రదేశ్ మరియు కేరళలో విజయవంతంగా నడుస్తున్నాయి.” అని అన్నారు.
ఈ 9మీటర్ల ఎయిర్ కండిషన్డ్ బస్సులు 35+ డ్రైవర్ సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటుకు యూఎస్బీ సాకెట్లు, ఎమర్జెన్సీ బటన్లు ఉంటాయి. బస్సులో అమర్చబడిన లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ట్రాఫిక్ మరియు ప్రయాణీకుల లోడ్ పరిస్థితుల ఆధారంగా ఒకే ఛార్జ్‌తో 180 కి.మీ.లు బస్సు ప్రయాణిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన ఈ విద్యుత్ బస్సులో పునరుత్పాదక బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, ఇది బ్రేకింగ్‌లో కోల్పోయిన గతిశక్తిలో కొంత భాగాన్ని తిరిగి పొందేందుకు ఈ బస్సులో సాధ్యమవుతుంది. హై పవర్ AC & DC ఛార్జింగ్ సిస్టమ్ బ్యాటరీని 3-4 గంటల్లో పూర్తిగా రీఛార్జ్ చేయడానికి వీలవుతుంది.
ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే భారతీయ రహదారులపై ఏడు కోట్ల కిలోమీటర్లకు పైగా నడిచాయి. సుమారు 46,000 టన్నుల CO2(కర్భన) ఉద్గారాలను తగ్గించాయి, ఈ ఉద్గారాలను తగ్గించాలంటే రెండు కోట్ల చెట్లు అవసరం. వివిధ రాష్ట్రాలకు 850 పైగా విద్యుత్ బస్సులను ఒలెక్ట్రా డెలివరీ చేసింది. ఒలెక్ట్రా బస్సులు ఎత్తైన హిమాలయ కొండల్లో, మనాలి నుండి రోహ్తంగ్ పాస్‌లో ప్రయాణించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరిన రికార్డులో చేరింది.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.