How to withdraw PF amount online in 2023
ఈపీఎఫ్ ఆన్లైన్ పోర్టల్లో ఇప్పుడు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం చాలా సులభం. అయితే అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని కోసం మనం కొన్ని స్టెప్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్ వెబ్సైట్ కి వెళ్లి మన యొక్క యు ఏ ఎన్ (UAN) నెంబర్ & పాస్ వర్డ్ ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయిన తర్వాత మన కేవైసీ డీటెయిల్స్ అన్ని కరెక్టుగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి.

మన ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబరు, పాన్ కార్డు కేవైసీ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి.
తరువాత ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి CLAIM అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి.

అందులో మన డీటెయిల్స్ అన్నీ చూపించడం జరుగుతుంది.
ఎంప్లాయి పేరు, డేట్ అఫ్ బర్త్, ఆధార్ నెంబర్, పాన్ కార్డు నెంబర్, బ్యాంకు బ్రాంచ్, నెంబర్ ఐడి, డేటాఫ్ జాయినింగ్ ఇలా మన డీటెయిల్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. అవన్నీ కరెక్ట్ గా ఉన్నట్లయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ దగ్గర పీఎఫ్ డబ్బులు ఏ బ్యాంకులో పడాలి అనుకుంటున్నారు ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి.

అప్పుడు మనకి ఒక POP-UP కనపడుతుంది.

మీరు ఇచ్చిన బ్యాంకు డీటెల్స్ కరెక్టేనా చెక్ చేసుకోండి. మీరు ఇచ్చిన బ్యాంకు అకౌంట్లో మీ PF అమౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. మీకు Terms * Conditions చూపిస్తుంది.
అక్కడ మీరు YES మీద క్లిక్ చేసి, కింద మనకు Proceed for Online Claim మీద క్లిక్ చేయాలి.
అందులో మనం మన డీటెయిల్స్ చెక్ చేసుకుని కింద లాస్ట్ లో I want to apply ఉంటుంది.
అక్కడ మనం PF Advance (Form 31) మీద క్లిక్ చేయాలి

అందులో మనం ఏ కాంట్రాక్టర్ దగ్గర నుంచి చేసుకుంటున్నాము ఆ కాంట్రాక్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత మనం దేనికోసం అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ కావాలి, అనేది ఇక్కడ ఎంటర్ చేసి అలాగే ఎంప్లాయ్ ఒక్క అడ్రస్ కూడా అక్కడ ఎంటర్ చేసి, Cheque or Bank Passbook స్కాన్ కాపీని అప్లోడ్ చేయాలి.

అప్లోడ్ చేసిన తర్వాత కింద Tick మార్క్ కనబడుతుంది దానిమీద క్లిక్ చేసి GET AADHAR OTP మీద క్లిక్ చేయాలి.
మన ఆధార్ కార్డు ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వెళ్లడం జరుగుతుంది.
ఇక్కడ మనం ఎంటర్ చేయాలి కింద ఉన్న ఓటిపి క్లిక్ చేయాలి తర్వాత మనకు అడ్వాన్స్ క్రైమ్ సబ్మిట్ చేసినట్టు మనకు పిడిఎఫ్ రూపంలో ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దానిని రిఫరెన్స్ గా ఉంచుకోవాలి. అప్లై చేసిన వారంలోపు మనకి మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో ఆ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది.


Website Link:
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫేస్బుక్లో వాట్సాప్ లో ఈ లింక్ ని షేర్ చేయండి.
మీకు ఇంకేమయినా సందేహాలు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.