కూకట్పల్లిలో ఘనంగా సోనియమ్మ జన్మదిన వేడుకలు. పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్

కూకట్పల్లిలో ఘనంగా సోనియమ్మ జన్మదిన వేడుకలు. పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్
Spread the love

కూకట్పల్లిలో ఘనంగా సోనియమ్మ జన్మదిన వేడుకలు. పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77 వ జన్మదిన వేడుకలు కూకట్పల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు , ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్ పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతున్ని కోరారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే అది సోనియా గాంధీ పెట్టిన బిక్ష అని వివరించారు. బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారెంటీలను సోనియా గాంధీ ప్రవేశ పెట్టిందన్నారు. నేడు ప్రజలకు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.కూకట్ పల్లి నియోజకవర్గం లో గల్లీ గల్లీకి తెలంగాణ రాష్ట్ర ధాత తల్లి సోనియాగాంధీ గారికీ కూకట్ పల్లి నియోజకవర్గం ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి నియోజకవర్గం లో వివిధ డివిజన్ లో జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్బంగా కేపీహెబ్ బీ డివిజన్ లో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డీ ఆధ్వర్యంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదానం చేయడం జరిగింది.

అలాగే మూసాపేట్ డివిజన్ లో బి బ్లాక్ ప్రెసిడెంట్ తూము వేణు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డీ, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ తో కలిసి కేక్ కట్ చేసి ఉచితంగా నేత్ర వైద్య శిబిరం ప్రారంభించి ఈ సందర్బంగా వారు నేత్ర పరీక్షలు చేసుకోవడం జరిగింది. అలాగే బాలాజీ నగర్, బాలానగర్, మూసాపేట్,కూకట్ పల్లి, రాజీవ్ గాంధీ నగర్,పతేనగర్, అల్లాపూర్, ఓల్డ్ బోయినపల్లి, సత్తర్ నగర్ వివిధ డివిజన్ లో, కాలనీ లలో డివిజన్ అధ్యక్షులఆధ్వర్యంలో కేక్ లు కట్ చేసి పండ్లు పంపిణి చేయడం జరిగింది.

ఈ కార్యకరములో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోర్డినేటర్ డాక్టర్ సత్యం శ్రీరంగం సీనియర్ నాయకులు గొట్టేముక్కల వెంకటేశ్వరావు, లక్ష్మణ్, టీపీసీసీ కార్యదర్శి నేతి శ్యామ్ సుంధర్, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, పుష్పరెడ్డి,రేష్మ, కృష్ణ వేణి, గోపాల్ రెడ్డీ, ప్రతాప్ రెడ్డీ,డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్,రాజపుట్, మధు, మల్లికార్జున యాదవ్, నర్సింహా యాదవ్, రమేష్ ముద్దిరాజ్,రమేష్ , సత్యనారాయణ, రాజశేఖర్ రెడ్డీ, అబ్దుల్ , కిషోర్, సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, ఎన్ ఎస్ యు ఐ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: