బులెట్ మిస్ ఫైర్. గాయాలపాలైన గోవిందా!

Share this news

బులెట్ మిస్ ఫైర్. గాయాలపాలైన గోవిందా!

ముంబై, మంగళవారం: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద తన ముంబై నివాసంలో తుపాకీని తనిఖీ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి, ఆయన పాదానికి గొలి తగిలి గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత గోవిందను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి, ఐసీయూలో చేర్పించారు.

Govinda Bullet fire

తాజాగా ఆసుపత్రి నుండి గోవింద తన ఆరోగ్యంపై మొదటి సందేశాన్ని పంచుకున్నారు. తన ప్రతినిధి ద్వారా పంపిన ఆడియో సందేశంలో గోవింద మాట్లాడుతూ, “మీ అందరి ఆశీర్వాదాలు, తల్లిదండ్రుల ఆశీస్సులు, మరియు గురువుల కృప వల్ల నాకి తగిలిన గొలి తీసివేయబడింది. మీ అందరి ప్రార్థనలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను!” అని తెలిపారు.

ముంబై పోలీసుల ప్రకారం, ఈ ప్రమాదం ఉదయం 4:45 గంటల సమయంలో జరిగింది. కోల్‌కతాకు వెళ్లడానికి సిద్దమవుతున్న సమయంలో, గోవింద తన లైసెన్స్ కలిగిన తుపాకీని క్యాబినెట్‌లో పెట్టే ప్రయత్నంలో అది ఆయన చేతి నుండి జారిపడడంతో, తుపాకీ పేలి ఆయన పాదానికి గొలి తగిలిందని గోవింద మేనేజర్ శశి సిన్హా ANI తో ఫోన్‌లో తెలిపారు. వైద్యులు గొలిని తీసివేశారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. అయితే, గోవింద ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *