ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్త ఆవిష్కరణ – పిల్లర్లు లేకుండా ఇళ్ల నిర్మాణం!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గృహ కల్పన లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు స్తంభాలు లేకుండా నిర్మించే ఇండ్లు నిర్మాణం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అత్యాధునిక నిర్మాణశైలితో తక్కువ ఖర్చులో బలమైన ఇళ్లను నిర్మించేందుకు ఈ కొత్త విధానం!
నిర్మాణ వ్యయం తగ్గించేందుకు: ప్రతి మండలంలో ఇద్దరు మేస్త్రీలకు న్యాక్ ద్వారా శిక్షణ.
Follow us for more details:
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో, సొంత స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇల్లు లేని పేదలకు స్థలం మరియు రూ. 5 లక్షల సహాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక అనంతరం, జాబితాను గ్రామ లేదా వార్డు సభలో ప్రదర్శిస్తారు. ఇంటి నిర్మాణం సమయంలో, వంటగది మరియు టాయిలెట్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు.
ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 2024 మార్చి 11న భద్రాచలం మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకటరావు, కోరం కనకయ్య, రాగమయి, జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేకతలు:
ఇంటి విస్తీర్ణం: 400 చదరపు అడుగులు
గదుల అమరిక: హాల్, కిచెన్, బాత్‌రూమ్, ఒక బెడ్‌రూమ్
నిర్మాణ శైలి: ఆర్‌సీసీ రూఫ్‌తో స్తంభాలు లేకుండా నిర్మాణం
ఖర్చు తగ్గింపు: తక్కువ వ్యయంతో ఇళ్లను నిర్మించేందుకు నూతన సాంకేతికతను ఉపయోగిస్తారు
Follow us for more details:
ఇందిరమ్మ ఇళ్లకు నిధుల మంజూరు:
స్వంత స్థలం కలిగిన వారికి: రూ. 5 లక్షల ఆర్థిక సహాయం
ఇల్లు లేని పేదలకు: భూమితో పాటు రూ. 5 లక్షల గృహనిర్మాణ నిధి
నిర్మాణ వ్యయం తగ్గించేందుకు: ప్రతి మండలంలో ఇద్దరు మేస్త్రీలకు న్యాక్ ద్వారా శిక్షణ
లబ్ధిదారుల ఎంపిక విధానం:
గ్రామ/వార్డు సభల ద్వారా దరఖాస్తుల పరిశీలన
అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను రూపొందించడం
చివరి జాబితాను గ్రామ/వార్డు సభలో ప్రదర్శించడం
స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించి తుది ఎంపిక
ఇంటి నిర్మాణంలో ప్రభుత్వ మార్గదర్శకాలు:
✅ ఇంటి నిర్మాణ సమయంలో కిచెన్ మరియు టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలి
✅ ఒకే ఇంటి నెంబర్‌పై ఒకటి కంటే ఎక్కువ ఇళ్ల మంజూరు నిషేధం
✅ స్థిరమైన నిర్మాణానికి అత్యాధునిక టెక్నాలజీ ప్రయోగం