AADHAR MOBILE UPDATE : ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ ఎలా చేయాలి? కొత్త ఆధార్ యాప్‌లో పూర్తి గైడ్
భారతదేశంలో ఎలాంటి ప్రభుత్వ సేవ అయినా, బ్యాంకింగ్, ఆధార్ ఆధారిత ధ్రువీకరణ, సబ్సిడీలు, పింఛన్లు, పథకాలు… ఇవన్నింటికీ Aadhaar-Mobile Number Linking చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటేనే OTP లభిస్తుంది, ఆధార్ సంబంధిత అన్ని ఆన్లైన్ సేవలు సులభంగా వినియోగించుకోవచ్చు.
తాజాగా UIDAI ఆధార్ యాప్‌ను అప్డేట్ చేస్తూ, మరింత సులభమైన ఫీచర్లతో కొత్త Aadhaar Appని విడుదల చేసింది. ఇప్పుడు వినియోగదారులు తమ మొబైల్ నంబర్ అప్డేట్ / చేంజ్ ప్రక్రియను ఈ యాప్ ద్వారా ఎంతో సులభంగా ప్రారంభించవచ్చు.
ప్రతిరోజు ప్రభుత్వ సంబంధిత వివరాలకు మన వాట్స్ అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
ఈ వ్యాసంలో మీరు తెలుసుకోబోతున్నది:
- ఆధార్‌లో మొబైల్ నంబర్ ఎందుకు అప్డేట్ చేసుకోవాలి?
- అప్డేట్కి అవసరమైన డాక్యుమెంట్స్
- కొత్త ఆధార్ యాప్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ చేయడానికి స్టెప్-బై-స్టెప్ గైడ్
- అప్డేట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- ముఖ్య సూచనలు
ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ ఎందుకు అవసరం?
మీ ఆధార్‌లో సరైన మొబైల్ నంబర్ ఉండటం వల్ల కింది ప్రయోజనాలు లభిస్తాయి:
✔️ OTP ఆధారిత సేవలు ఉపయోగించుకోవచ్చు
✔️ e-KYC వెరిఫికేషన్ సులభం
✔️ ఆధార్ PVC కార్డు ఆర్డర్ చేయడం సులువు
✔️ బ్యాంకింగ్, PAN-Aadhaar లింకింగ్ లాంటి సేవలు సజావుగా సాగుతాయి
✔️ ప్రభుత్వ పథకాలు, DBT సబ్సిడీలకు ఎటువంటి అంతరాయం ఉండదు
అందువల్ల మొబైల్ నంబర్ మారిన వెంటనే ఆధార్‌లో అప్డేట్ చేయడం చాలా అవసరం.
మొబైల్ నంబర్ అప్డేట్కు అవసరమైనది?
ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ చేయడానికి ప్రత్యేక డాక్యుమెంట్ అవసరం లేదు.
అప్డేట్ ప్రక్రియలో:
- మీ ఆధార్ నంబర్
- అప్డేట్ చేయాలనుకున్న కొత్త మొబైల్ నంబర్
- OTP ను స్వీకరించే సామర్థ్యం
అంతే అవసరం.
UIDAI ప్రస్తుత నిబంధనల ప్రకారం, మొబైల్ నంబర్ అప్డేట్ చేయడానికి Rs. 50/- సేవా చార్జీ ఉండవచ్చు (ఎన్రోల్మెంట్ సెంటర్లో).
ప్రతిరోజు ప్రభుత్వ సంబంధిత వివరాలకు మన వాట్స్ అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
కొత్త ఆధార్ యాప్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ చేయడానికి పూర్తి ప్రక్రియ
కొత్త Aadhaar App (mAadhaar) లోని సౌకర్యం ద్వారా మీరు మొబైల్ నంబర్ అప్డేట్ రిక్వెస్ట్‌ని చాలా సులభంగా రేజ్ చేయవచ్చు. అయితే తుద అప్డేట్ మాత్రం ఆధార్ సేవా కేంద్రంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో జరుగుతుంది.
అప్డేట్ రిక్వెస్ట్ ఎలా చేయాలి? చూద్దాం.
Download now!
Android: https://tinyurl.com/5hex3yay
iOS: https://tinyurl.com/2r43hdnr
Step 1: కొత్త Aadhaar App ని డౌన్లోడ్ చేయండి
Google Play Store / Apple App Store లో Aadhaar App (UIDAI) అని శోధించి అధికారిక యాప్‌ను ఇన్స్టాల్ చేయండి.
ఎలాంటి third-party యాప్ డౌన్లోడ్ చేయకండి.
Step 2: యాప్‌లో మీ Aadhaar వివరాలు నమోదు చేయండి
యాప్ ఓపెన్ చేసిన తర్వాత:
పైకి స్క్రోల్ చేయండి. అక్కడ మీకు సర్వీసెస్ అని కనపడుతుంది.
దాని కింద అప్డేట్ మై ఆధార్ అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి.
Step 3: యాప్‌లో మీ Aadhaar వివరాలు నమోదు చేయండి
అందులో మొబైల్ నెంబర్ అప్డేట్ మీద క్లిక్ చేయండి
మీ కొత్త మొబైల్ నెంబర్ ను వెరిఫై చేయండి.
మీ ఫేస్ అంథేన్తికేషన్ కంప్లీట్ చేయండి.
75 రూపాయలు పే చేయండి అంతే
7 రోజులు లోప్ మీ కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది.
ప్రతిరోజు ప్రభుత్వ సంబంధిత వివరాలకు మన వాట్స్ అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.