Post Office Jobs : ఎలాంటి రాత పరీక్ష లేకుండానే పోస్ట్ ఆఫీస్ లో ఉద్యొగాలు! పది పాసైతే చాలు!
Post Office Jobs : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది యువతకు కేంద్ర ప్రభుత్వం పెద్ద గుడ్‌న్యూస్ చెప్పబోతోంది. తపాల శాఖ పరిధిలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీ ఎత్తున నియామకాలకు రంగం సిద్ధమైంది. 2026 సంవత్సరానికి గాను మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేయడానికి ఇండియా పోస్టు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
అందుతున్న సమాచారం ప్రకారం, ఈ నోటిఫికేషన్ జనవరి నెలాఖరులోపు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంతర్గత ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడగానే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ నియామకాల ప్రత్యేకత ఏంటంటే… ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారు చేసి, అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయించనున్నారు. కాబట్టి టెన్త్ పాస్ అయిన యువతకు ఇది ఓ గొప్ప అవకాశం అని చెప్పొచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా
👉 బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM)
👉 అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM)
👉 గ్రామీణ డాక్ సేవక్ (GDS)
వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు తమకు కేటాయించిన జిల్లాలు, మండలాల పరిధిలోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి సమాచారం అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఇండియా పోస్టు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పాత విద్యార్థులకు మరో అవకాశం
ఇదిలా ఉండగా, తెలంగాణలోని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) పాత విద్యార్థులకు మరో కీలక అవకాశాన్ని ప్రకటించింది. గతంలో వివిధ కారణాల వల్ల డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారికి స్పెషల్ రీ-అడ్మిషన్ అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
1986 నుంచి 2013 విద్యాసంవత్సరాల మధ్యలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో విద్యార్థి సేవల విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.
అదనపు సమాచారం కోసం
📞 కాల్ సెంటర్: 1800 599 0101
📞 హెల్ప్ డెస్క్: 040 – 23680222
నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
మొత్తానికి, ఒకవైపు ఇండియా పోస్టు భారీ ఉద్యోగ నోటిఫికేషన్, మరోవైపు డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం… యువతకు ఇది నిజంగా డబుల్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.