Gas eKYC: Aadhaar FaceRD App మరియు మీ గ్యాస్ కంపెనీ యాప్ (HP Pay / IndianOil One / Bharat Gas) ఉపయోగించి 2 నిమిషాల్లో LPG Gas eKYC పూర్తి చేయవచ్చు.
LPG గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు Gas eKYC తప్పనిసరి అయ్యింది. ఇప్పుడిది చేయడానికి గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. Aadhaar FaceRD App మరియు మీ గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో నుంచే LPG Gas eKYC పూర్తి చేయవచ్చు.
HP Gas, Indian Oil, Bharat Gas వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కేవలం 2–3 నిమిషాల్లో Aadhaar Face Authentication ద్వారా eKYC పూర్తవుతుంది.
LPG Gas eKYC ఎలా చేయాలి? (Step-by-Step Guide)
1️⃣ Apps డౌన్‌లోడ్ చేయండి
- Google Play Store లోకి వెళ్లి ఈ రెండు యాప్స్ ఇన్‌స్టాల్ చేయండి
- HP Pay / IndianOil One / Bharat Gas App
- Aadhaar FaceRD App
- Apps Links
HP Gas App Link : https://play.google.com/store/apps/details?id=com.drivetrackplusrefuel&pcampaignid=web_share
Indane Gas App Link : https://play.google.com/store/apps/details?id=cx.indianoil.in&pcampaignid=web_share
Bharath Gas App Link : https://play.google.com/store/apps/details?id=com.lma2&pcampaignid=web_share
Aadhar Face RD App Link:
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd&pcampaignid=web_share
2️⃣ గ్యాస్ కంపెనీ యాప్ ఓపెన్ చేయండి
మీ గ్యాస్ కనెక్షన్ ఉన్న కంపెనీ యాప్ ఓపెన్ చేసి Registered Mobile Number తో Login అవ్వండి.
3️⃣ eKYC ఆప్షన్ సెలెక్ట్ చేయండి
యాప్‌లో Profile / Services / eKYC అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
4️⃣ Aadhaar Authentication కి Consent ఇవ్వండి
Terms & Conditions కు అంగీకరించి Proceed చేయండి.
5️⃣ Face Capture చేయండి
“Capture Face” పై క్లిక్ చేస్తే Aadhaar FaceRD App ఓపెన్ అవుతుంది.
6️⃣ Face Scan చేయండి
స్క్రీన్ పై చూపిన విధంగా మీ ముఖాన్ని కెమెరాకు ఎదురుగా ఉంచి స్కాన్ చేయండి.
7️⃣ eKYC Complete Message వస్తుంది
Verification పూర్తయిన తర్వాత eKYC Successful అని మెసేజ్ వస్తుంది.
LPG eKYC చేయడానికి అవసరమైనవి
✔ గ్యాస్ కనెక్షన్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్
✔ అదే మొబైల్ నెంబర్ Aadhaar కు కూడా లింక్ అయి ఉండాలి
✔ Smartphone & Internet
✔ Aadhaar FaceRD App
ముఖ్యమైన సూచనలు
- Aadhaar Biometrics Lock ఉంటే ముందుగా Unlock చేయాలి
- ఇది పూర్తిగా ఉచితం – ఎలాంటి ఛార్జీలు ఉండవు
- ఇంట్లో నుంచే 2–3 నిమిషాల్లో eKYC పూర్తి చేయవచ్చు
- eKYC చేయకపోతే LPG subsidy నిలిచిపోవచ్చు
LPG Gas eKYC ఎందుకు అవసరం?
ప్రభుత్వం LPG సబ్సిడీని సరైన లబ్ధిదారులకు చేరేందుకు Aadhaar ఆధారిత eKYC తప్పనిసరి చేసింది. దీంతో డూప్లికేట్ కనెక్షన్లు తగ్గి, నిజమైన వినియోగదారులకు మాత్రమే ప్రయోజనం అందుతుంది.