మీ ఇంట్లో రేషన్ కార్డు ఉందా? అయితే రూ.5 లక్షలు మీకే!

Share this news

మీ ఇంట్లో రేషన్ కార్డు ఉందా? అయితే రూ.5 లక్షలు మీకే!

ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒక్కడే… అతను చనిపోతే ఆ కుటుంబం ఏమవుతుందో ఆలోచించారా? తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది. అందుకే ఈ పథకం తీసుకొచ్చింది. రేషన్ కార్డు.

తెలంగాణ బడ్జెట్ 2026-27 లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక announcement చేశారు. దాని పేరు — ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. సింపుల్ గా చెప్పాలంటే — మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే చాలు, రూ.5 లక్షల బీమా ఉచితంగా వస్తుంది. మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే కట్టిస్తుంది.

ప్రతిరోజు ప్రభుత్వ సంబంధిత వివరాలకు మన వాట్స్ అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

ఇది పేదవాళ్ళకు మాత్రమే కాదు సుమా. పేద, మధ్యతరగతి, ధనిక — అని ఏ తేడా చూడట్లేదు ప్రభుత్వం. రేషన్ కార్డు ఉంటే అందరికీ వర్తిస్తుంది. అంటే రాష్ట్రంలో 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.

ఒక్కసారి ఆలోచించండి — ఇంట్లో నాన్న ఒక్కడే సంపాదిస్తున్నారు. ఒక రోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన చనిపోయారు. ఆ క్షణం నుండి EMI, పిల్లల fees, అద్దె — అన్నీ ఆగిపోతాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికే ఈ పథకం తీసుకొచ్చారు. ఆ రూ.5 లక్షలు ఆ కుటుంబానికి తిరిగి లేచే అవకాశం ఇస్తాయి.

ఎప్పటి నుండి మొదలవుతుందంటే

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం — జూన్ 2, 2026 నుండి ఈ పథకం officially మొదలవుతుంది. ఆ రోజు నుండి రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కవరేజ్ automatic గా వర్తిస్తుంది.

మీరు ఇప్పుడు ఏం చేయాలంటే: వేరే ఏ application చేయాల్సిన అవసరం లేదు. మీ రేషన్ కార్డు details — పేరు, address, family members — అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి check చేసుకోండి. Details update గా ఉంటే జూన్ 2 నుండి మీకు automatic గా రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. అంతే.

ప్రతిరోజు ప్రభుత్వ సంబంధిత వివరాలకు మన వాట్స్ అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

ఇది బడ్జెట్ లో భాగంగా వచ్చిన ఒక్క పథకమే కాదు. రూ.3,24,234 కోట్ల బడ్జెట్ లో మరిన్ని పథకాలు కూడా ప్రకటించారు. కానీ ఈ బీమా పథకం గురించి ముందు తెలుసుకోవాలి ఎందుకంటే — ఇది మీకు directly affect అయ్యే విషయం.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *