ప్రభుత్వానికి ఈటల రాజేందర్ వార్నింగ్
నైతిక విలువలు పాటించాలి ప్రజాస్వామ్యన్నీ గౌరవించాలి అని టిఆర్ఎస్ పార్టీ కి శాసనసభ సభ్యత్వనికి రాజీనామ చేసి బీజేపీలో చేరనని ఈటెల రాజేందర్ అన్నారు. రాజీనామ చేసిన తర్వాత మొదటిసారిగా హుజురాబాద్ నియోజకవర్గనికి వచ్చిన ఈటల కు అభిమానులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను, తన అనుచరులను వేధిస్తే ఘోరీ కడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హుజురాబాద్ ప్రజలు ప్రేమకు లోగుతారని ఆయన అన్నారు. తనకు మద్దతు ఇస్తున్న వారిని ఇంటిలీజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వాళ్ళను వేధిస్తే ఖబడ్ధార్ అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మగౌరవము ఉందా అని ఈటల ప్రశ్నించారు. 2024లో జరిగే ఎన్నికలకు హుజురాబాద్ ఉప ఎన్నిక రిహార్సల్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మగౌరవ పోరాటానికి హుజురాబాద్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి ఇంటింటికి వెళ్లి అందరిని కలుస్తానని ఈటెల రాజేందర్ తెలిపారు.