తెలంగాణ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శుభవార్తను తెలిపారు.
యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ను సీఎం కేసిఆర్ ఆదేశించారు.
రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి.
ఇందుకోసం గాను 7600 కోట్ల రూపాయలను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది.
రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం, పంట పెట్టుబడిని అందించడం, దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణ గా సత్ఫలితాలనిస్తున్నది.
ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్తు తో పాటు, రైతు బీమా తో పాటు, పంటలు పండించేందుకు నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడి ని అందించడం ద్వారా తెలంగాణ వ్యవసాయం లో విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా..దేశ వ్యవసాయ రంగ నమూనా మార్పు కు(paradigm shift) కు దారితీసింది.
ముఖ్యమంత్రి కేసిఆర్ గారి వ్యవసాయ అనుకూల దార్శనిక నిర్ణయాలు,ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణాను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయి.
దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను,కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
పలు మార్గాలనుండి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 40 వేల కోట్ల రూపాయలను రాకుండా కేంద్రం తొక్కిపెట్టింది.
రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా,ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ ,, తెలంగాణ రైతులను ప్రజలను కష్టాల పాలు చేయాలని కేంద్రం చూస్తున్నది.
కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ది విషయం లో ఎన్ని కష్టాలెదురైనా రాజీ పడకుండా రైతులకు రైతు బంధు నిధులను టంచనుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది.
ఎలాంటి కోతలు లేకుండా, రైతులందరికీ పూర్తి స్థాయిలో, సకాలం లో రైతు బంధు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రెటరీ కి సీఎం కేసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిర్ణయం, రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల సీఎం కేసిఆర్ పాలనకున్న చిత్తశుద్ది కి నిదర్శనంగా నిలిచింది.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.