డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ఈనెల 27వ తేదీన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహిస్తాం.
ఈ నెల 27వ తేదీన నిర్వహించే ఆన్ లైన్ డ్రా లో 3,4 విడతలకు సంబంధించి 21 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది, వారిలో అక్టోబర్ 2వ తేదీన 10,500 మందికి, అక్టోబర్ 5వ తేదీన మరో 10,500 మందికి చొప్పున ఇండ్ల ను పంపిణీ చేస్తాం.
GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పటికే 2 విడతలలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా ఎంతో పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి 24,900 ఇండ్లను పంపిణీ చేయడం జరిగింది.
మొదటి, రెండో విడతల కు సంబంధించి లబ్దిదారుల ఎంపిక కోసం అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే NIC రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించడం జరిగింది.