తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ – Ration Card Application Form
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ: అర్హులందరికీ లబ్ధి.

అప్లికేషన్స్ ఫార్మ్స్ ప్రాంతాన్ని బట్టి మారాయి! కొత్త వి వస్తే నేను అప్డేట్ చేస్తాను.
గ్రామ సభల కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్: రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందజేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26, 2025 నుండి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు
రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12,000 అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12,000 ఇవ్వనున్నట్లు తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలు
ఖమ్మం జిల్లా బనిగండ్లపాడులో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాములను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని, ఇంకా ఏ లిస్ట్ తయారు కాలేదని, ప్రజలు అపోహలు పడవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారని తెలిపారు.
మంత్రుల సమీక్ష సమావేశం
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, లక్ష్మీకాంత్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు.
సర్వే ఆధారంగా అర్హుల గుర్తింపు
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 6.68 లక్షల పేద కుటుంబాలకు రేషన్ కార్డులు పొందే అర్హత ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితాను 33 జిల్లాలకు పంపించింది. జనవరి 20 నుండి 24 వరకు గ్రామ, బస్తీ సభలు నిర్వహించి, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత తుది జాబితా ఖరారవుతుందని అధికారులు తెలిపారు.
పాత రేషన్ కార్డులపై స్పష్టత
పాత రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని, అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందే వరకు జారీ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
దరఖాస్తు ప్రక్రియ
రేషన్ కార్డు అర్హత కలిగిన వారు సంబంధిత అధికారికి లేదా ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాల ద్వారా పేద ప్రజలకు ఆర్థిక భద్రత, ఆహార భద్రత కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలు సబ్సిడీ ధరలకు ఆహార పదార్థాలు పొందగలుగుతాయి.
మన ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవ్వండి నాకు పర్సనల్ గ మెసేజ్ చేసి మీ సందేహాలను తీర్చుకోండి.
https://www.instagram.com/tanvitechs
Application Forms:
Another Application Form:
