ఈ రోజు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ సెలవా! మీకు కూడా మెసేజ్ వచ్చిందా? కానీ ప్రభుత్వం ఏం చెబుతోంది?
Some private schools are closed today! Did you get the message too? But what is the government saying?

మొహర్రం సందర్భంగా సెలవు ఇచ్చినట్లు పేర్కొంటూ SMS, ఈ సందేశాలు రావడం తల్లిదండ్రుల్లో సందిగ్ధాన్ని కలిగిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆధికారిక సెలవు తేదీ మాత్రం జూలై 6 (ఆదివారం) అని ఉండటంతో, ఈ రోజు అధికారికంగా సెలవు లేదు.
ఇప్పుడు ఈ పరిస్థితిపై పూర్తిగా వివరంగా తెలుసుకుందాం:
ప్రతిరోజు ప్రభుత్వ సంబంధిత వివరాలకు మన వాట్స్ అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
▶️ మొహర్రం సెలవు ఎప్పుడు?
తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన 2025–26 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, మొహర్రం సెలవు జూలై 6, ఆదివారంననే ఉంది. ఇది ప్రభుత్వ సెలవుగా ప్రకటించబడింది. అందుచేత ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, మున్సిపల్ పాఠశాలలు ఇవన్నీ ఆదివారం సెలవుగా తీసుకున్నాయి.
▶️ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఎందుకు సెలవు ప్రకటించాయి?
కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మొహర్రం వేడుకలు ఇంకా కొనసాగుతున్నాయనే కారణంతో ఆదివారం తర్వాత సోమవారం (జూలై 7)న కూడా సెలవు ఇస్తున్నట్లు తల్లిదండ్రులకు SMSలు పంపించాయి.
ప్రతిరోజు ప్రభుత్వ సంబంధిత వివరాలకు మన వాట్స్ అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
ఇలాంటి సందేశాలు వచ్చిన తల్లిదండ్రులు తమ బాలల స్కూల్కు ఈ రోజు వెళ్ళించాలా, లేదా అనే సందేహంలో ఉన్నారు.
ఈ రోజు సెలవు ఉందని మెసేజ్ వచ్చిందా? అయితే కింద కామెంట్ చేయండి. మిగతా తల్లిదండ్రులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.